Saudi Arabia లో భారత ప్రవాసుడికి తీరని గుండెకోత.. కళ్లముందే కుమారుడికి అలా జరగడంతో ఆ తండ్రి బాధ వర్ణణాతీతం!

ABN , First Publish Date - 2022-05-28T17:52:45+05:30 IST

చేతికి అందివచ్చిన కొడుకు తన కళ్లముందే ప్రాణాలు కోల్పోతే ఆ తండ్రి గుండెకోతను మాటల్లో చెప్పలేం.

Saudi Arabia లో భారత ప్రవాసుడికి తీరని గుండెకోత.. కళ్లముందే కుమారుడికి అలా జరగడంతో ఆ తండ్రి బాధ వర్ణణాతీతం!

రియాద్: చేతికి అందివచ్చిన కొడుకు తన కళ్లముందే ప్రాణాలు కోల్పోతే ఆ తండ్రి గుండెకోతను మాటల్లో చెప్పలేం. అలాంటి గుండెకోతనే ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఓ భారత వ్యక్తి అనుభవిస్తున్నాడు. 30 ఏళ్లుగా సౌదీలో ఉంటున్న మహమ్మద్ నయీం అనే భారత ప్రవాసుడు ఇటీవల తన కళ్లముందే కన్న కొడుకును రోడ్డు ప్రమాదంలో పొగొట్టుకున్నాడు. ఉద్యోగం కోసం సౌదీకి పిలిచిన కొడుకు తన కళ్లముందే చనిపోవడం నయీంను తీవ్రంగా కలిచివేసింది. అతని బాధ వర్ణణాతీతం అంటూ సౌదీ వాసులు నయీంపై సానుభూతి చూపిస్తున్నారు. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టైలర్‌గా పనిచేసే మహమ్మద్ నయీంకు సౌదీ అరేబియాలోని అల్ అఫ్లాజ్‌లో సొంత టైలరింగ్ షాపు ఉంది. 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో అతనికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో స్వదేశానికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అక్కడ టైలర్‌గా నయీంకు మంచి పేరుంది. బిజినెస్ బాగా నడుస్తోంది. దాంతో అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన కుమారుడిని సౌదీకి పిలిచి తాను నిర్వహిస్తున్న టైలర్ షాపును అతనికి అప్పగించాలని అనుకున్నాడు. వెంటనే స్వదేశానికి వచ్చి కుమారుడిని సౌదీ తీసుకెళ్లాడు. అయితే, సౌదీ వెళ్లిన రెండో రోజే నయీం కొడుకు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 


తండ్రి కొడుకు ఇద్దరు పనిమీద బయటకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తన కళ్లముందే కుమారుడు చనిపోవడం నయీంకు తీరని గుండెకోతను మిగిలిచింది. చేదుడుగా ఉంటాడని తీసుకొచ్చిన కుమారుడు ఇలా అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. అక్కడి మీడియా సమాచారం ప్రకారం అఫ్లాజ్‌లోనే నయీం తన కుమారుడి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిసింది. ప్రస్తుతం అతని పరిస్థితి చూసి తెలిసినవారంతా జాలి పడుతున్నారు. ఇప్పటికే ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్న నయీంకు ఇలా చేతికి అందివచ్చిన కొడుకు అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోడం తీరని వేదనగా మారింది. 

Updated Date - 2022-05-28T17:52:45+05:30 IST