Indian Team for SA T20 Series: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తలపడబోయే భారత జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరంటే..

ABN , First Publish Date - 2022-05-23T00:04:59+05:30 IST

ఐపీఎల్ వేడి ఇంకా చల్లారనే లేదు. మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తాజాగా.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. చేతన్ శర్మ నేతృత్వంలోని..

Indian Team for SA T20 Series: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తలపడబోయే భారత జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరంటే..

ఐపీఎల్ వేడి ఇంకా చల్లారనే లేదు. మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తాజాగా.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ఎంపికలో చాలా సర్‌ప్రైజ్‌లే ఇచ్చింది. శిఖర్ ధావన్‌ను పూర్తిగా పక్కనపెట్టేసింది. హార్థిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కింది. దినేష్ కార్తీక్‌ను కూడా జట్టులోకి తీసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాకు విశ్రాంతినిచ్చి కేఎల్ రాహుల్‌ను సౌతాఫ్రికాతో జరగనున్న సిరీస్‌కు కెప్టెన్‌గా ప్రకటించింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉండటం కేఎల్ రాహుల్‌కు కలిసొచ్చిన అంశం.


150 kmph స్పీడ్‌తో బంతిని మెరుపు వేగంతో విసురుతున్న కశ్మీర్ చిచ్చరపిడుగు, SRH బౌలర్‌ ఉమ్రాన్ మాలిక్‌ను సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు జట్టులో చోటు లభించింది. Death Oversలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ పంజాబ్ కింగ్స్‌ బౌలింగ్‌ విభాగంలో అర్ష్‌దీప్ కీలకంగా ఉన్నాడు. RCB జట్టులో మంచి ఫామ్‌తో ఆకట్టుకున్న దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 9 నుంచి భారత్, సౌతాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య 5 టీ-20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా జట్టు ఇదే..


సౌతాఫ్రికాతో టీ20ల్లో తలపడనున్న టీమిండియా స్క్వాడ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), రిషబ్ పంత్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, చాహల్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవీష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

Updated Date - 2022-05-23T00:04:59+05:30 IST