UAEలో కలకలం సృష్టించిన ఇండియన్ టీనేజర్.. 30 గంటల తర్వాత ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2022-03-18T15:16:34+05:30 IST

యూఏఈలో 10వ తరగతి చదువుతున్న ఇండియన్ టీనేజర్ కలకలం సృష్టించాడు. లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. తల్లిదండ్రులు సహా పోలీసులను పరుగులు పెట్టించాడు. సుమారు 30 గంటల తర్వాత తిరి

UAEలో కలకలం సృష్టించిన ఇండియన్ టీనేజర్.. 30 గంటల తర్వాత ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

ఎన్నారై డెస్క్: యూఏఈలో 10వ తరగతి చదువుతున్న ఇండియన్ టీనేజర్ కలకలం సృష్టించాడు. లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. తల్లిదండ్రులు సహా పోలీసులను పరుగులు పెట్టించాడు. సుమారు 30 గంటల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడంతో అతడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



భారత్‌కు చెందిన మోహిత్ సేత్ దంపతులు కొన్నేళ్ల క్రితం షార్జా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే కొడుకు, కూతురికి జన్మనిచ్చారు. మోహిత్ సేత్ కొడుకు అనవ్ సేత్.. ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఢిల్లీ ప్రైవేట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. తాజాగా అనవ్ సేత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తల్లి, చెల్లి నిద్రపోతున్న సమయంలో ‘సారీ.. మీరు కోరుకున్న విధంగా చేయలేకపోతున్నా’ అని లెటర్ రాసి బుధవారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. దీంతో మోహిత్ సేత్ దంపతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా తమ కొడుకు జాడ కనుక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సుమారు 30 గంటల తర్వాత అనవ్ సేత్.. ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి.. ఈ క్రమంలో అనవ్ సేత్ ఒత్తిడికి గురై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2022-03-18T15:16:34+05:30 IST