Indian visitors: దుబాయ్‌కు పొటెత్తిన భారతీయ సందర్శకులు.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు..

ABN , First Publish Date - 2022-08-10T19:07:25+05:30 IST

భారతీయ పర్యాటకులు దుబాయ్‌కు పొటెత్తారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో(జనవరి నుంచి జూన్ వరకు) ఏకంగా 8.58 లక్షల మంది దుబాయ్‌ను సందర్శించారు.

Indian visitors: దుబాయ్‌కు పొటెత్తిన భారతీయ సందర్శకులు.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు..

దుబాయ్: భారతీయ పర్యాటకులు దుబాయ్‌ (Dubai)కు పొటెత్తారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో(జనవరి నుంచి జూన్ వరకు) ఏకంగా 8.58 లక్షల మంది దుబాయ్‌ను సందర్శించారు. గతేడాది ఇదే సమయానికి కేవలం 4.09 లక్షల మంది మాత్రమే విజిట్ చేసినట్లు దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామీ అండ్ టూరిజం (DET) వెల్లడించింది. మొత్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 71.2లక్షల మంది విదేశీ పర్యటకు దుబాయ్‌ను సందర్శించినట్లు డీఈటీ పేర్కొంది. 2021 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఇది సుమారు మూడు రేట్లు (2021లో కేవలం 25.2లక్షల మంది మాత్రమే విజిట్ చేశారు) అని తెలిపింది. ఇక 2019లో మొదటి ఆరు నెలల వ్యవధిలో అత్యధికంగా 83.6 లక్షల మంది పర్యటించినట్లు డీఈటీ డేటా ద్వారా తెలిసింది. కాగా, ప్రాంతీయలవారీగా చూసుకుంటే పశ్చిమ ఐరోపా పర్యాటకులు రాకపోకలలో పెద్ద వాటాను కలిగి ఉన్నారు. 2022 మొదటి ఆరు నెలల్లో మొత్తం అంతర్జాతీయ సందర్శకులలో 22 శాతం మంది ఐరోపా నుంచే ఉన్నారు. ఇదిలాఉంటే.. మహమ్మారి కరోనా కారణంగా గడిచిన రెండేళ్లు టూరిజం రంగం ఘోరంగా దెబ్బతింది. గత ఆరు నెలల నుంచి దాదాపు ప్రపంచ దేశాలన్ని కరోనా ఆంక్షలు సడలించడంతో ఇప్పుడిప్పుడే పర్యాటకానికి మునుపటి కళ వస్తోంది.       

Updated Date - 2022-08-10T19:07:25+05:30 IST