Viral Video: విదేశీయులను పెళ్లాడిన భారతీయుల ఇళ్లల్లో సీన్ ఇలా ఉంటుంది..!

ABN , First Publish Date - 2022-06-22T02:17:59+05:30 IST

ఒకప్పుడు భారతీయలు విదేశీయులను పెళ్లాడారంటే వింత చెప్పుకునే వారు కానీ.. ఈ రోజుల్లో ఇదంతా కామన్..! గ్లోబలైజేషన్ పుణ్యమా అని..

Viral Video: విదేశీయులను పెళ్లాడిన భారతీయుల ఇళ్లల్లో సీన్ ఇలా ఉంటుంది..!

ఎన్నారై డెస్క్: ఒకప్పుడు భారతీయులు విదేశీయులను పెళ్లాడారంటే వింతగా చెప్పుకునే వారు కానీ.. ఈ రోజుల్లో ఇదంతా కామన్..! గ్లోబలైజేషన్ పుణ్యమా అని విదేశాల్లో స్థిరపడిన భారతీయ సంతతి వారు విదేశీయులను వివాహం చేసుకుంటుంటారు. ఇది సోషల్  మీడియా జమానా కావడంతో ఇటువంటి జంటలు తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలను తరచూ నెట్టింట్లో షేర్ చేస్తుంటాయి. ఇక భారత సంతతికి చెందిన షారూది కూడా ఇదే తీరు. ఆమె నిత్యం తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. షారూ భర్త పేరు ఆర్నాడ్ ఓబర్. అతడు ఫ్రెంచ్ జాతీయుడు. ఆ జంట కెనడాలో నివసిస్తుంటుంది. కాగా.. షారూ తాజాగా తన భర్తకు సంబంధించి షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 


భర్త పరాఠాలు తింటూ ఎంజాయ్ చేస్తుండగా షారూ వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె.. భర్త పరాఠా రుచిని ఆస్వాదిస్తుండగా అతడిని ఏం తింటున్నావు అని అడిగింది. దీంతో.. అతడు వంటకం పేరును పలికే ప్రయత్నంలో పమాటా అనేస్తాడు. నేనన్నది కరెక్టేగా అని ఆ తరువాత అడుగుతాడు. అయితే..ఆమె అతడి తప్పును సరిచేస్తూ అది పరాఠా అని చెప్పింది. అయితే..అతడు తాను పరాఠా పేరును దాదాపుగా సరిగ్గానే పలికానని, ఒక్క అక్షరమే తేడా వచ్చిందంటూ జోక్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో వారంతా.. పరాఠా పేరును పమాతాగా మార్చేద్దామంటూ కామెంట్లు చేస్తున్నారు. 




Updated Date - 2022-06-22T02:17:59+05:30 IST