Dubai నుంచి భారత్‌లోకి అడుగుపెట్టగానే విమానాశ్రయంలోనే ఓ వ్యక్తి అరెస్ట్.. గల్ఫ్ దేశంలో ఉంటూ చేసి పాడు పనితో..

ABN , First Publish Date - 2022-05-10T23:48:14+05:30 IST

దుబాయ్‌కు వెళ్లిన ఓ యువకుడికి ఇండియాకు తిరిగి రాగానే ఊహించని షాక్ తగిలింది.

Dubai నుంచి భారత్‌లోకి అడుగుపెట్టగానే విమానాశ్రయంలోనే ఓ వ్యక్తి అరెస్ట్.. గల్ఫ్ దేశంలో ఉంటూ చేసి పాడు పనితో..

ఎన్నారై డెస్క్: దుబాయ్‌కు వెళ్లిన ఓ యువకుడికి ఇండియాకు తిరిగి రాగానే ఊహించని షాక్ తగిలింది.   అభ్యంతరకర మెసేజీ పంపించాడంటూ ఓ మహిళ అతడిపై ఫిర్యాదు చేయడంతో..  పోలీసులు అతడిని ఆదివారం విమానాశ్రయంలోనే అదపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మనేసర్(హరియాణా) టౌన్‌కు చెందిన ఓ మహిళ.. ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లా వాసి షాహ్జేబ్ అలీపై  ఫిబ్రవరి 1న  పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు తనకు అసభ్యకర మెసేజీలు, వీడియోలు వాట్సాప్‌ ద్వారా పంపించాడని పేర్కొంది. వద్దని వారించినా అతడు వినలేదని ఆరోపించింది. దీంతో.. పోలీసులు సెక్షన్ 354డీ  ఐటీ చట్టం సెక్షన్ 67, కింద అతడిపై కేసు నమోదు చేశారు. 


ఇక విచారణ సందర్భంగా అతడు దుబాయ్‌లో ఉన్నట్టు తేలింది. ఓ షేక్ ఇంట్లో పనిచేస్తున్నట్టు బయటపడింది. దీంతో.. వారు అతడిపై లుక్‌  అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నిందితుడు  ఆదివారం స్వదేశానికి తిరిగి రానున్నాడని ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. వారు నిందితుడిని ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో తనకు తెలీదని నిందితుడు పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. తన మెసేజీలకు మొదట ఆమె స్పందించాకే తాను మెసేజీలు పంపించానని తెలిపాడు. కాగా..  నిందితుడిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి అతడిని జుడీషియల్ కస్టడీకి పంపించారు. 



Read more