60 ఏళ్ల నాటి గణిత సమస్యకు పరిష్కారం కనిపెట్టిన భారతీయ శాస్త్రజ్ఞుడు!

Dec 5 2021 @ 19:39PM

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాత్సవ సిప్రియన్ ఫోయ్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఆడమ్ మార్కస్, డానియెల్ స్పీల్‌మెన్ శాస్త్రవేత్తలతో కలిసి శ్రీవాత్సవ ఈ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఆపరేటర్ థియరీలో ఆయన జరిపిన విశేష కృషికి గాను అమెరికా మేథమెటిక్ సొసైటీ ఆయనను ఈ ప్రైజుకు ఎంపిక చేసింది. శ్రీవాత్సవ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో విద్యార్థులకు గణిత శాస్త్రం బోధిస్తున్నారు. మేట్రీసెస్‌ పాలీనామియల్స్ అంశంలో  ఈ ముగ్గురు జరిపిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్టు అమెరికా మేథమెటికల్ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది. 

‘‘ఈ ముగ్గురి నూతన ఆలోచనల కారణంగా ఆపరేటర్ థియరీలో పలు కీలక విధానాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ విధానాలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రిచర్డ్ కేడిసన్, ఇసాడోర్ సింగర్ గణిత శాస్త్రజ్ఞులు 1959లో ప్రతిపాదించిన పేవింగ్ ప్రాబ్లమ్‌ ఈ విధానాలతో పరిష్కారం దొరికింది అని అమెరికా మేథమెటిక్ సొసైటీ(ఏఎమ్ఎస్) పేర్కొంది. కాగా.. సిప్రియన్ ఫోయిస్ ప్రైజ్‌‌ను  ఏఎమ్ఎస్ ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టింది. కాగా.. వచ్చే జనవరిలో సియాటిల్‌లో జరగనున్న జాయింట్ మేథమెటిక్స్ మీటింగ్‌లో అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగుతుంది. కాగా.. నిఖిల్ శ్రీవాత్సవ గతంలోనూ గణితశాస్త్రానికి చెందిన ప్రముఖ అవార్డులను గెలుపొందారు. 2014లో జార్జి పోల్యా ప్రైజ్, ఈ ఏడాదిలో హెల్డ్ ప్రైజ్‌లను ఆయన గెలుపొందారు.  

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.