సింగపూర్‌లో భారత సంతతి యువ డాక్టర్‌కు భారీ స్కాలర్‌షిప్!

ABN , First Publish Date - 2022-06-03T01:25:19+05:30 IST

కరోనా వ్యాక్సిన్ కొనుగోలుకు సింగపూర్ ప్రభుత్వం తయారీదారులతో జరిపిన చర్చల్లో కీలకంగా వ్యవహరించిన భారత సంతతికి చెందిన డా. ప్రేమికకు(24) ప్రఖ్యాత లీ కువాన్ యూ స్కాలర్‌షిప్‌ మంజూరైంది. ఇందులో భాగంగా అమెరికాలో చదువుకునేందుకు ఆమె 50 వేల డాలర్ల ఉపకారవేతనం పొందనున్నారు.

సింగపూర్‌లో భారత సంతతి యువ డాక్టర్‌కు భారీ స్కాలర్‌షిప్!

ఎన్నారై డెస్క్: కరోనా వ్యాక్సిన్ కొనుగోలుకు సింగపూర్ ప్రభుత్వం తయారీదారులతో జరిపిన చర్చల్లో కీలకంగా వ్యవహరించిన భారత సంతతికి చెందిన డా. ప్రేమికకు(24) ప్రఖ్యాత లీ కువాన్ యూ స్కాలర్‌షిప్‌  మంజూరైంది. ఇందులో భాగంగా అమెరికాలో చదువుకునేందుకు ఆమె 50 వేల డాలర్ల ఉపకారవేతనం పొందనున్నారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన ముగ్గురిలో  ప్రేమిక కూడా ఒకరు. సింగపూర్ విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో టీకాల కొనుగోలుకు జరిగిన చర్చల్లో ప్రేమిక ప్రముఖ పాత్ర పోషించారు. వ్యాక్సి్న్ తయారీదారులతో అగ్రిమెంట్లు కుదుర్చుకునే క్రమంలో పలు అనిశ్చిత పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చిందని ప్రేమిక స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘టీకాల డిమాండ్‌ ఏ మేరకు ఉంటుందో అప్పట్లో కచ్చితంగా అంచనా వేయడం మా  టీంకు కష్టంగా మారింది. బూస్టర్ టీకా డోసు అవసరం ఉంటుందో లేదో కూడా మాకు తెలియదు. బూస్టర్ డోసు అవసరం లేని పక్షంలో టీకా నిల్వలను ఏం చేయాలా అని అప్పట్లో ఆలోచించాం. సరిపడినన్ని టీకాలు లేకపోతే ఎలా ప్రశ్నించుకున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.  


వివిధ దేశాలకు టీకాల అందేలా చేసేందుకు కృషి చేస్తున్న అంతర్జాతీయ కరోనా టీకా కూటమి గావీ(Gavi)తో కూడా కలిసి ఆమె పనిచేశారు. సింగపూర్ విదేశాంగ శాఖ, గావీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ వివిధ దేశాలకు టీకాల ఉచితంగా సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించారు. కాగా.. వచ్చే ఏడాది ప్రేమిక అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్శిటీలో ప్రజారోగ్య సంబంధిన కోర్సు చేసేందుకు వెళ్లనున్నారు. అద్భుత ప్రతిభ కనబరిచిన సింగపూర్ వాసుల పైచదువులు కొనసాగించేందుకు టాంజోంగ్ పాగర్ సిటిజన్స్ కన్సల్టేటివ్ కమిటీ ఈ ఉపకారవేతనాలు ఇస్తుంటుంది. సింగపూర్ తొలి ప్రధాని లీ కువాన్ యూ పేరిట 1991లో ఇది ఈ స్కాలర్ షిప్ ప్రారంభమైంది. ఈ ఏడు.. డా. ప్రేమికతో పాటూ డా. హెయిరిల్ రిజాల్ అబ్దుల్లా(42), మ్యాథ్యూ మున్ హాంగ్(32) కూడా దీనికి ఎంపికయ్యారు.  



Updated Date - 2022-06-03T01:25:19+05:30 IST