ముంబైకి నేరుగా విమానసర్వీసులు నడపండి.. ఆస్ట్రేలియాలోని భారతీయుల విన్నపం!

ABN , First Publish Date - 2022-02-22T01:59:02+05:30 IST

కరోనా సంక్షోభం క్రమంగా నెమ్మదిస్తున్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులను దేశంలోకి అనుమతించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిడ్నీ, ముంబై నగరాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు నడపాలంటూ ఆస్ట్రేలియాలోని భారతీయులు.. ఇరు దేశాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

ముంబైకి నేరుగా విమానసర్వీసులు నడపండి.. ఆస్ట్రేలియాలోని భారతీయుల విన్నపం!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం క్రమంగా నెమ్మదిస్తున్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులను దేశంలోకి అనుమతించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిడ్నీ, ముంబై నగరాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు నడపాలంటూ ఆస్ట్రేలియాలోని భారతీయులు..  ఇరు దేశాల ప్రభుత్వాలు, విమానయాన సంస్థలకు తాజాగా విజ్ఞప్తి చేశారు. change.org‌లో ఓ ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించారు. 


‘‘ప్రస్తుతం ముంబై నుంచి నేరుగా సిడ్నీ వెళ్లేందుకు విమాన సర్వీసులేవీ అందుబాటులో లేవు. ఆ మాటకొస్తే.. అహ్మదాబాద్ లేదా బెంగళూరు నుంచి కూడా సిడ్నీకి డైరెక్ట్ విమాన సర్వీసులు లేవు.  ఫలితంగా మొత్తం ప్రయాణం 20 నుంచి 30 గంటలు పడుతోంది. దీని వల్ల ప్రయాణ ఖర్చులు పెరగడమే కాకుండా సమయం కూడా వృథా అవుతోంది.’’ అని ఈ పిటిషన్ దాఖలు చేసిన అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ప్రతి ఏటా భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు  భారీ సంఖ్యలో పర్యటకులు వెళుతుంటారు. 2018-19 మధ్యలో రికార్డు స్థాయిలో 3.72 లక్షల మంది భారతీయులు ఆస్ట్రేలియాలో పర్యటించారు. 2002 నుంచి ఆస్ట్రేలియాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-02-22T01:59:02+05:30 IST