NEET centre: ప్రధాని మోదీకి ఒమన్‌లోని ఇండియన్ కమ్యూనిటీ విజ్ఞప్తి

ABN , First Publish Date - 2021-07-29T23:29:42+05:30 IST

భారత ప్రభుత్వం తాజా ప్రకటనపట్ల ఒమన్‌లోని ఇండియన్ కమ్యూనిటీ స్పందించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాసింది. ఒమన్‌లో సైతం నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అం

NEET centre: ప్రధాని మోదీకి ఒమన్‌లోని ఇండియన్ కమ్యూనిటీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తాజా ప్రకటనపట్ల ఒమన్‌లోని ఇండియన్ కమ్యూనిటీ స్పందించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాసింది. ఒమన్‌లో సైతం నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అందులో కోరింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశం కోసం ప్రభుత్వం ఏటా నీట్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విదేశాల్లోని భారతీయ విద్యార్థులు సైతం ఈ పరీక్షకు హాజరవుతుంటారు. కాగా.. భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షకు హాజరయ్యే కువైత్‌లోని విద్యార్థుల కోసం అక్కడే ఓ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. పరీక్ష కోసం ఇండియాకు రావాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ క్రమంలో ఒమన్‌లోని ఇండియన్ కమ్యూనిటీ స్పందించింది. మస్కట్‌లో కూడా ఓ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ఒమన్‌లో 500 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నట్టు తెలిపింది. కువైత్‌లో లాగా మస్కట్‌లో కూడా నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ 500 మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొంది. కాగా.. నీట్ ఎగ్జామ్‌ సెప్టెంబర్ 12న జరగనున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2021-07-29T23:29:42+05:30 IST