26/11: ప్రపంచదేశాల్లోని పాకిస్థాన్ ఎంబసీల ఎదుట భారతీయుల నిరసన

ABN , First Publish Date - 2020-11-27T07:15:38+05:30 IST

ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడికి గురువారంతో 12 ఏళ్లు పూర్తైంది. ఈ దాడిని భారత్‌లో పాటు ప్రపంచదేశాల్లో ఉన్న భారతీయులు

26/11: ప్రపంచదేశాల్లోని పాకిస్థాన్ ఎంబసీల ఎదుట భారతీయుల నిరసన

న్యూఢిల్లీ: ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడికి గురువారంతో 12 ఏళ్లు పూర్తైంది. ఈ దాడిని భారత్‌లో పాటు ప్రపంచదేశాల్లో ఉన్న భారతీయులు ఇప్పటికి మర్చిపోలేదు. గురువారం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న పాకిస్థాన్ ఎంబసీల ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జపాన్‌లోని భారతీయులు పాకిస్థాన్ ఎంబసీ ఎదుట నిరసన కార్యకమ్రాన్ని నిర్వహించారు. ముంబై దాడుల్లో జపాన్‌కు చెందిన హిసాషి సూడా అనే వ్యక్తి కూడా మరణించడంతో..  ఆయన జ్ఞాపకార్థం కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. మరోపక్క నేపాల్‌లో వేలాది మంది రోడ్డెక్కి ముంబై ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ముంబైలో జరిగిన దాడులు భవిష్యత్తులో మరెక్కడా జరగకూడదని నిరసనకారులు కోరుకున్నారు. కాగా.. 2008 నవంబర్ 26వ తేదీన లష్కర్-ఈ-తయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని అనేక హోటళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత సైనికులు రంగంలోకి దిగి 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ప్రాణాలతో బయటపడిన అజ్మల్ అమిర్ కసబ్ అనే ఉగ్రవాదికి 2012లో ఉరిశిక్ష పడింది. 

Updated Date - 2020-11-27T07:15:38+05:30 IST