Parents and Grandparents Programme: భారతీయులకు భారీ లబ్ధి!

ABN , First Publish Date - 2021-07-22T18:17:24+05:30 IST

పేరెంట్స్, గ్రాండ్‌పేరెంట్స్‌ను తమతో పాటు కెనడా తెచ్చుకోవాలనుకునే ప్రవాసులకు అక్కడి సర్కార్ తాజాగా తీపి కబురు చెప్పింది.

Parents and Grandparents Programme: భారతీయులకు భారీ లబ్ధి!

టొరంటో: పేరెంట్స్, గ్రాండ్‌పేరెంట్స్‌ను తమతో పాటు కెనడా తెచ్చుకోవాలనుకునే ప్రవాసులకు అక్కడి సర్కార్ తాజాగా తీపి కబురు చెప్పింది. ఇంతకుముందు ప్రతియేటా ఇలాంటి వారికి కేవలం 10వేల మందికి మాత్రమే కెనడా వచ్చేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు దీనిని 40వేలకు పెంచింది. అంటే ఇకపై ప్రతి ఏడాది అదనంగా 30వేల మంది పేరెంట్స్, గ్రాండ్‌పేరెంట్స్‌ కెనడా వెళ్లొచ్చు. పేరెంట్స్ అండ్ గ్రాండ్‌పేరెంట్స్‌ ప్రొగ్రామ్(పీజీపీ)లో భాగంగా ఇప్పటి నుంచి ప్రతియేటా అదనంగా 30వేల దరఖాస్తులను అదనంగా స్వీకరించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులను తిరిగి కలిసి ఉండేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కెనడా పేర్కొంది.


ఇక కెనడాలో ఇండో-కెనడియన్లు వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాజాలలో ఒకటి కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా భారీ లబ్ధి పొందేది భారతీయులేనని చెప్పొచ్చు. సెప్టెంబర్ 20 నుంచి ఈ కార్యక్రమానికి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. రెండు వారాల పాటు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరి దరఖాస్తులు అంగీకరించబడతాయో వారు వారి తల్లిదండ్రులు, తాతామామలను కెనడాకు తీసుకురావడానికి అనుమతి పొందుతారు. కెనడాలో మరిన్ని ప్రవాస కుటుంబాలు తిరిగి కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్కో ఈఎల్ మెండిసినో తెలిపారు.

Updated Date - 2021-07-22T18:17:24+05:30 IST