ఆధార్ నంబర్ల లీక్.. బహిర్గతమైనపోతున్న మిలియన్లమంది రైతుల సమాచారం!

ABN , First Publish Date - 2022-06-14T22:16:38+05:30 IST

ఆధార్.. జాతీయ గుర్తింపు డేటా బేస్‌లో భాగంగా ప్రతీ భారతీయుడికి ప్రభుత్వం ఓ నంబరును కేటాయించింది. అదే ‘ఆధార్’.

ఆధార్ నంబర్ల లీక్.. బహిర్గతమైనపోతున్న మిలియన్లమంది రైతుల సమాచారం!

న్యూఢిల్లీ: ఆధార్.. జాతీయ గుర్తింపు డేటా బేస్‌లో భాగంగా ప్రతీ భారతీయుడికి ప్రభుత్వం ఓ నంబరును కేటాయించింది. అదే ‘ఆధార్’. ఇందులో ఉండే 12 అంకెలు చాలా విలువైనవి. వీటిని గోప్యంగా ఉంచుకోవాలి. ఇవి కనుక బయటపడితే పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లినట్టే. ప్రభుత్వ పథకాలు, ఇతర పనుల కోసం ప్రభుత్వాలు, ఇతర సంస్థలు సేకరించే ఆధార్ నంబర్లు గతంలో లీకైనట్టు పలు నివేదికలు బయటపెట్టాయి. బ్యాంకింగ్ డేటాకు అనుసంధానమై ఉన్న 130కిపైగా ఆధార్ నంబర్లు బహిర్గతమైనట్టు 2017లో ఓ నివేదిక వెల్లడించింది.


తాజాగా, ప్రభుత్వ వెబ్‌సైట్ ఒకటి దేశంలోని రైతుల ఆధార్ నంబర్లను బయటపెట్టేస్తున్నట్టు చెబుతూ సెక్యూరిటీ రీసెచర్చర్ అతుల్ నాయర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌ రైతుల డేటాను బహిర్గతం చేసేస్తోందని ఆయన పేర్కొన్నారు.  దేశంలోని ప్రతి రైతుకు కనీస ఆదాయం అందించే లక్ష్యంతో పీఎం-కిసాన్ సమ్మాన్ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రం నుంచి వచ్చే ఆదాన్ని పొందేందుకు రైతులు ఈ వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవడంతోపాటు ఆధార్ నంబరును కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మిలియన్ల మంది రైతుల నుంచి సేకరించిన ఆధార్ వివరాలను ఈ వెబ్‌సైట్ బయటపెట్టేస్తోందంటూ అతుల్ నాయర్ కొన్ని ఆధారాలు కూడా చూపించారు. 


‘టెక్‌క్రంచ్’ అనే ఆన్‌లైన్ న్యూస్ పేపర్.. వెబ్‌సైట్‌లోని ఓ సాధనాన్ని ఉపయోగించి బహిర్గతమైన డేటాను ప్రతి రైతు సమాచారంతో పోల్చడం ద్వారా డేటా బహిర్గతం కావడం నిజమేనని ధ్రువీకరించింది. అంతేకాదు, ఓ చిన్న స్క్రిప్ట్ రాయడం ద్వారా అటాకర్లు చాలా సులభంగా రైతుల సమాచారాన్ని దొంగిలించవచ్చని కూడా హెచ్చరించింది. 

Updated Date - 2022-06-14T22:16:38+05:30 IST