29 నుంచి భారత్ - సింగపూర్ విమాన సర్వీసులు: CAAS

ABN , First Publish Date - 2021-11-22T02:38:21+05:30 IST

29 నుంచి భారత్ - సింగపూర్ విమాన సర్వీసులు: CAAS

29 నుంచి భారత్ - సింగపూర్ విమాన సర్వీసులు: CAAS

న్యూఢిల్లీ: భారతదేశం నుంచి సింగపూర్‌కు నవంబర్ 29 నుంచి రోజువారీ 6 విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని సింగపూర్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది. వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్ ( వీటీఎల్) కార్యక్రమం కింద సింగపూర్ మరియు భారతదేశం మధ్య వాణిజ్య విమానాలు నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. చెన్నై, ఢిల్లీ, ముంబై నుంచి రోజువారీ 6 విమానాల సర్వీసులు ఉంటాయి. షెడ్యూల్ చేయబడిన వాణిజ్య ప్రయాణీకుల విమానాల పునఃప్రారంభంపై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సింగపూర్ పౌర విమానయాన అథారిటీ (సీఏఏఎస్) ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించింది.

Updated Date - 2021-11-22T02:38:21+05:30 IST