IndiaTV Matrize Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే!

ABN , First Publish Date - 2022-07-30T00:39:22+05:30 IST

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్లీ బీజేపీ సారధ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది.

IndiaTV Matrize Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే!

న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ (LokSabha Election)కు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్లీ బీజేపీ సారధ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ సర్వే (IndiaTV Matrize Survey) అంచనా వేసింది. బీజేపీ (BJP) సారధ్యంలో ఎన్డీయే (NDA)కు 362, కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యూపిఏకు 97, ఇతరులు 84 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. ఒక్క బీజేపీకే 326 స్థానాల్లో విజయం లభిస్తుందని సర్వే తెలిపింది. రాష్ట్రాల వారీగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలో తేలింది. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ముందుందని వెల్లడించింది. మొత్తంగా కేంద్రంలో బీజేపీ హ్యట్రిక్ ఖాయమని, మళ్లీ మోదీ సర్కారు అధికారంలోకి వస్తుందని సర్వే తెలిపింది. 











తెలంగాణలో బీజేపీ ఈసారి 6 ఎంపీ సీట్లు గెలుచుకోబోతోందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది. 


ఎన్డీయే పక్షాలకు 42 శాతం ఓటింగ్ రాబోతోందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ సర్వే  తెలిపింది. 

Updated Date - 2022-07-30T00:39:22+05:30 IST