
భోపాల్: సూరత్-కోల్‌కతా ఎయిర్‌లైన్స్ విమానం భోపాల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానాన్ని భోపాల్‌కు మళ్లించి విమానాశ్రయంలో దించినట్టు అధికారులు ఆదివారంనాడు తెలిపారు. సూరత్ నుంచి కోల్‌కతాకు విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయని, దీంతో భోపాల్‌కు మళ్లించి విమానాశ్రయంలో అత్యవసరంగా దించినట్టు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని, విమానంలో 172 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు.