విమానాలు రద్దయితే ‘ ప్లాన్-బి’ని ఎంచుకోండి.. ఆదివారం లాక్‌డౌన్ నేపథ్యంలో ఇండిగో సూచన

ABN , First Publish Date - 2022-01-09T01:27:11+05:30 IST

రాష్ట్రంలో యథేచ్ఛగా పెరిగిపోతున్న కరోనా కేసులను అదుపు చేసుందుకు తమిళనాడు ప్రభుత్వం ఆదివారాల్లో..

విమానాలు రద్దయితే ‘ ప్లాన్-బి’ని ఎంచుకోండి.. ఆదివారం లాక్‌డౌన్ నేపథ్యంలో ఇండిగో సూచన

తమిళనాడు: రాష్ట్రంలో యథేచ్ఛగా పెరిగిపోతున్న కరోనా కేసులను అదుపు చేసుందుకు తమిళనాడు ప్రభుత్వం ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు కీలక సూచన చేసింది. ప్రయాణాల కోసం ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. విమానాశ్రయానికి చేరుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కనుక ‘ప్లాన్-బి’ని ఎంచుకోవాలని కోరింది.


విమానం రద్దైనా, చివర్లో రీషెడ్యూల్ అయినా బాధపడాల్సిన అవసరం లేదని, అటువంటి వారి కోసం ప్లాన్-బిని సిద్ధంగా ఉంచామని పేర్కొంది. ఈ ప్లాన్‌లో ప్రయాణ సమయాన్ని కానీ, లేదంటే తేదీని కానీ మార్చుకునే వీలుందని తెలిపింది. అది కూడా కుదురకుంటే టికెట్‌ను రద్దు చేసుకుని సొమ్ము వెనక్కి తీసుకోవచ్చని వివరించింది. అయితే, ఒకసారి ప్లాన్-బిని ఎంచుకున్న తర్వాత ఇండిగో షరతులు, నిబంధనల ప్రకారం తదుపరి మార్పులు, లేదంటే రద్దు కోసం ఆ మేరకు చార్జీని వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - 2022-01-09T01:27:11+05:30 IST