IndiGo Plane : ఇండిగో విమానంలో స్మోక్ వార్నింగ్..

ABN , First Publish Date - 2022-08-22T02:48:45+05:30 IST

ఇటివల విమానాల్లో సాంకేతిక లోపాలకు సంబంధించి వరుస ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆదివారం ఢిల్లీ - కోల్‌‌కతా(Delhi-Kolkata) ఇండిగో విమానంలో(Indigo Plane) సమస్య తలెత్తింది.

IndiGo Plane : ఇండిగో విమానంలో స్మోక్ వార్నింగ్..

కోల్‌కతా : ఇటివల విమానాల్లో సాంకేతిక సమస్యలకు సంబంధించి వెలుగుచూస్తున్న వరుస ఘటనలు కలవరపరుస్తున్నాయి. తాజాగా ఆదివారం ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీ - కోల్‌‌కతా(Delhi-Kolkata) ఇండిగో విమానంలో(Indigo Plane) పొగలు వెలువడ్డాయి. దీంతో స్మోక్ వార్నింగ్ అలారం మోగింది. అప్రమత్తమైన పైలెట్లు ఎస్‌వోపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) పాటించారు. కోల్‌కత్తా విమానాశ్రయం ఏటీసీ(ATC) అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానం ల్యాండింగ్‌కు ముందు ఎస్‌వోపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం చర్యలు తీసుకున్నారు. ల్యాండింగ్ తర్వాత ప్రమాదకరమైన ఘటనలేమైనా జరిగితే ఎదుర్కొనేందుకుగానూ తగిన చర్యలు తీసుకున్నారు. విమానం సేఫ్‌గా ల్యాండవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


కాగా ఇండిగో ఫ్లైట్ 6E-2513 లోని ‘కార్గో హోల్డ్ ఏరియా’ నుంచి పొగ వెలువడింది. ఇది ఫేక్ సిగ్నలే అయినప్పటికీ పైలెట్లు ఎస్‌వోపీ పాటించారు.  కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు. ల్యాండింగ్ తర్వాత తనిఖీ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ సిబ్బందిని సంసిద్ధం చేశారు. సురక్షితంగా ల్యాండవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కూడా స్పందించింది. ఫేక్ వార్నింగే అయినప్పటికీ పైలెట్లు ఎస్‌వోపీ పాటించారని, విమానం సురక్షితంగా ల్యాండయ్యిందని ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2022-08-22T02:48:45+05:30 IST