పైలెట్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో..

ABN , First Publish Date - 2022-08-02T18:31:54+05:30 IST

ఫ్లీట్ సైజ్(fleet size), మార్కెట్ వాటా ప్రకారం దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో

పైలెట్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో..

Indigo Firm : ఫ్లీట్ సైజ్(fleet size), మార్కెట్ వాటా ప్రకారం దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో(IndiGo, the country’s largest airline) నవంబర్ నాటికి పైలట్ల జీతాల(pilots’ salaries)ను పూర్తిగా పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. కోవిడ్-19 లాక్‌డౌన్‌(Covid-19-induced lockdowns) సమయంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని డొమాస్టిక్ క్యారియర్స్ తమ సిబ్బంది జీతాలను తగ్గించాయి. ఈ సమయంలో ఇండిగో సంస్థ తమ పైలట్ల జీతాల్లో సంస్థ దాదాపు 28 శాతం కోత విధించింది. 


అయితే గత నవంబర్‌లో ప్రతిపాదించిన 6.5 శాతం నుంచి ఆగస్టులో 8 శాతానికి ఎయిర్‌లైన్ వేతనాన్ని పునరుద్ధరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. “ఇంధనం, విదేశీ మారకపు వ్యయం అధికమవడం వంటి సమస్యలున్నప్పటికీ.. మేము లాభదాయకత, అధిక వృద్ధికి తిరిగి చేరుకుంటామని మేము భావిస్తున్నాం. మా సిబ్బంది వేతనాలను నిరంతరం పునఃపరిశీలించడం, వాటిని కోవిడ్-పూర్వ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ఎయిర్‌లైన్‌కి చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్, కెప్టెన్ అషిమ్ మిత్రా(airline’s senior vice president of flight operations, Capt. Ashim Mittra) వెల్లడించారు.

 

సెప్టెంబరు నుంచి మరో 6 శాతం వేతనాన్ని పెంచుతున్నామని.. మిగిలిన 6 శాతం నవంబర్‌లో పెంచుతామని ఎయిర్‌లైన్ సంస్థ తెలిపింది. ఉక్రెయిన్‌(Ukraine)లో రష్యా సైనిక చర్య(Russian military action) ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి విలువ క్షీణించడం, దిగుమతుల భారం పెరిగిపోవడం కారణంగా దేశంలోనే అత్యంత ప్రభావితమైన పరిశ్రమలలో విమానయాన పరిశ్రమ(aviation industry) ఒకటిగా నిలిచింది. పెరిగిన ముడి చమురు ధరల కారణంగా.. ప్రస్తుతం భారతీయ క్యారియర్ కార్యాచరణ వ్యయంలో ఇంధనం వ్యయమే దాదాపు 50 శాతంగా ఉండటం గమనార్హం.


Updated Date - 2022-08-02T18:31:54+05:30 IST