ఆగని అక్రమం!

ABN , First Publish Date - 2020-09-14T11:04:46+05:30 IST

జిల్లాలో అధికార యంత్రాంగం కరోనా కట్టడిలో నిమగ్న మై ఉండగా.. పలువురు అక్రమార్కులు యథేచ్ఛగా గుట్కా, రేషన్‌ బియ్యం, ఇసుక అక్రమ రవాణాకు

ఆగని అక్రమం!

జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్న గుట్కా, ఇసుక, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

రాత్రుల్లో దర్జాగా తరలిస్తున్న అక్రమార్కులు

యంత్రాంగం కరోనా విధుల్లో నిమగ్నం కావడంతో కలిసివస్తున్న వైనం

అక్కడక్కడా పలువురు అధికారులు దాడులు చేస్తున్నా ఆగని దందా

అక్రమార్కులకు ‘పెద్దల’ అండదండలు


నిజామాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

జిల్లాలో అధికార యంత్రాంగం కరోనా కట్టడిలో నిమగ్న మై ఉండగా.. పలువురు అక్రమార్కులు యథేచ్ఛగా గుట్కా, రేషన్‌ బియ్యం, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రాత్రివేళల్లో గుట్టుగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు తరలిస్తూ విక్రయిస్తున్నారు. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతా ల నుంచి గుట్కాను తీసుకువచ్చి దుకాణాలకు సరఫరా చే స్తున్నారు. కరోనా నేపథ్యంలో ధరలు పెంచి విక్రయిస్తున్నా రు. రేషన్‌ బియ్యం కూడా జిల్లా సరిహద్దులు దాటుతోంది. ఇసుకను రాత్రివేళల్లో తవ్వకాలు చేసి డంపులు ఏర్పాటు చే సి విక్రయిస్తున్నారు. అధికారులు దృష్టి సారించకపోవడంతో ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. 


జోరుగా గుట్కా అమ్మకాలు

జిల్లాలో నిషేధిత గుట్కా అమ్మకాలు జోరుగా సాగుతు న్నాయి. లాక్‌డౌన్‌తో కొద్ది రోజులు తగ్గినా గడిచిన రెండు నెలల నుంచి అమ్మకాలు మళ్లీ జోరందుకున్నాయి. జిల్లాలో ని అన్ని గ్రామాల పరిధిలో గుట్కా అమ్మకాలు కొనసాగుతు న్నాయి. ప్రభుత్వం గుట్కా అమ్మకాలను నిషేధించినా మ హారాష్ట్ర నుంచి జిల్లాకు ఎక్కువగా రవాణా అవుతోంది. జి ల్లాకు చెందిన కొంతమంది మద్దతు ఇవ్వడంతో అమ్మకాల కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అక్రమార్కులు నేరు గా దుకాణాదారులకు చేరవేస్తున్నారు. కరోనా పేరుతో గతం కంటే ధర పెంచి అమ్ముతున్నారు. అధికారులు పట్టుకుంటు న్నారని, తాము ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి అమ్ముతున్నా మని చెబుతున్నారు. జిల్లాలో గుట్కా తయారీ యూనిట్లు లేకున్నా పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయి. అక్కడి నుంచి రాత్రివేళలలో జిల్లా కేంద్రానికి చేరవేస్తున్నా రు. తర్వాత జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ షాపు లకు చేరవేస్తున్నారు. జిల్లా సరిహద్దు నుంచి ఇతర ప్రాంతా లకు చేరవేసేందుకు కొంత మంది అధికారులతో పాటు ప్ర జాప్రతినిధులు సహకరిస్తుండటంతో గుట్కా అమ్మకాలు జో రుగా సాగుతున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు పట్టుకున్నా.. ఒకటి, రెండు రోజుల పాటు నిలిపివేసి మళ్లీ కొనసాగిస్తున్నారు.


పెద్దల అండ ఉండడంతో పలు చోట్ల అ ధికారులు కూడా జోక్యం చేసుకోవడం లేదు. ఆరోగ్యం దెబ్బ తింటుందని ప్రభుత్వంతో పాటు వైద్యులు చెబుతున్నా.. అ మ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ అధి కారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుట్కాను భారీగా ప ట్టుకుని సీజ్‌ చేశారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. గుట్కాను పట్టుకున్నా కేసును ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు బది లీ చేస్తుండడంతో అమ్మకాలు చేసేవారు బయపడడం లే దు. కేసులు నమోదు చేసినా మళ్లీ కొనసాగిస్తున్నారు. లా భాలు ఎక్కువగా ఉండడంతో ఈ దందాను ఆపడం లేదు.  


ఆగని రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

జిల్లాలో లాక్‌డౌన్‌ సడలింపులు మొదలైనప్పటి నుంచీ  రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. బియ్యానికి డిమాండ్‌ ఉండడంతో పక్కదారి పట్టిస్తున్నారు. ఇతర ప్రాం తాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి బి య్యానికి మహారాష్ట్రలో డిమాండ్‌ ఉండటంతో కొందరు అక్కడి తరలించి అమ్మకాలు చేస్తున్నారు. లాక్‌డౌ న్‌ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం బియ్యం కోటాను పెంచింది. మేజార్టీ ప్రజలు ఈ బియ్యాన్ని ఉపయోగించుకోగా కొంతమంది మాత్రం పక్క దారి పట్టించారు. జిల్లా కేంద్రంలో పాటు ఇతర ప్రాంతాల్లో కొంత మంది ఇదే వ్యాపారంగా పెట్టుకున్నారు. వీరు రెషన్‌ బియ్యం లబ్ధిదారుల నుంచి కోనుగోలు చేసి ప్రతినెలా అమ్మ కాలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని రైస్‌ మిల్లుల్లో కూడా భారీ గా రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. వీటి అమ్మకం వల్ల లాభా లు ఉండడం, కొంత మంది అధికారులు సహకరించడం వల్ల ఈ అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.


జిల్లా కేంద్రంలో ని ఓ ప్రాంతంలో రేషన్‌ బియ్యాన్ని కొందరు ఏళ్ల తరబడి కొనుగోలు చేస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు అధికారు లు కూడా జంకుతారు. కొన్నిసార్లు కేసులు పెట్టి వదిలి వే యడంతో ఈ దందా ఆగడం లేదు. జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మండలస్థాయి అధికారి నుంచి జిల్లా అధి కారి వరకు తెలిసినా ఏమీ చేయని పరిస్థితి ఉందని సీనియ ర్‌ అధికారి ఒకరు తెలిపారు. పట్టుకుని కేసు పెట్టినా మళ్లీ కొన్ని రోజులకే దందా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ బియ్యం ఎక్కువగా కొన్ని రైస్‌ మిల్లులకు వెళ్లోందని అన్నా రు. జిల్లాలో గడిచిన నెల రోజుల్లో సుమారు నలభై లక్షల కుపైగా విలువైన బియ్యాన్ని ఎన్‌ఫో ర్స్‌మెంట్‌, పోలీసు అధికా రులు పట్టుకున్నారు. బాధ్యులపై కేసులు పెట్టారు. వీటిలో ఒక రైస్‌ మిల్లులో భారీగా బియ్యం దొరికినా కేసుపెట్టి వదిలి వేశారు. మిల్లర్లకు చెందిన లాబీ గట్టిగా పనిచేయడంతో చూసీ చూడనట్లు వ్యవహరించారు. 


అనుమతులు లేకున్నా ఇసుక అక్రమ దందా

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోం ది. ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నందున వర్షాలు పడుతున్నా వాగులు, మంజీరా నది ప్రాంతాల్లో రాత్రి వేళల్లో తవ్వకాలు చేస్తున్నారు. తమకు అనూకూలంగా ఉన్న ప్రాంతాల్లో నిల్వ ఉంచుతున్నారు. డిమాండ్‌ ఉన్న చోటుకు తరలించి అమ్మ కాలు చేస్తున్నారు. జిల్లాలోని కోటగిరి, బోదన్‌, నవీపేట, ఆ ర్మూర్‌, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మోపాల్‌, భీమ్‌గల్‌, మోర్తాడ్‌, వేల్పూర్‌ మండలాల పరిధిలో ఇసుక తవ్వ కాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పథకా లు, అభివృద్ధి పనుల అవసరాలు మినహా వేరే అవసరాలకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఆయా మండ లాల పరిధిలో తహసీల్దార్‌లు మాత్రమే అనుమతులు ఇ స్తున్నారు. ఇసుకకు డిమాండ్‌ ఉండడం వల్ల రాత్రివేళల్లో వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకవచ్చి డంపులలో నిలు వ ఉంచుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ఇతర ప్రాం తాలకు తరలించి అమ్మకాలు చేస్తున్నారు. ఈ మధ్యనే టా స్క్‌ఫోర్స్‌ అధికారులు భారీగా ఇసుక నిల్వలు పట్టుకున్నారు. వాహనాలు సీజ్‌ చేశారు. కేసులు నమోదు చేశారు. 


జిల్లాలో అక్రమ దందాలు ఎక్కువగా జరుగుతున్నా మం డలస్థాయిలో అధికారులు దృష్టి పెట్టడం లేదు. అన్ని స్థా యిల నుంచి ఒత్తిళ్లు ఉండడం, పట్టుకున్నా వదిలి వేయమ ని ఫోన్‌లు వస్తుండటంతో చూిసీచూడనట్లు వ్యవహరిస్తు న్నారు. కొంత మంది సీనియర్‌ అధికారులు మాత్రం తాము పట్టుకున్నా లాభం ఉండటం లేదని తెలిపారు. అక్రమ రవా ణా చేసే వారికి నేతలతో పాటు ఇతరులు అండగా నిలువ డం వల్ల తాము ఏమీ చేయలేక పోతున్నామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా కేసులు చేసి ఎక్కువగా పట్టుకుంటే బదిలీ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో గుట్కా, రేషన్‌ బియ్యం, ఇసుక అక్రమ రవాణాకు రాజకీయ నేతల అండదడలు ఉ న్నన్ని రోజులు ఎవరూ ఆపలేరని తెలిపారు.

Updated Date - 2020-09-14T11:04:46+05:30 IST