earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం

ABN , First Publish Date - 2022-08-29T14:10:02+05:30 IST

ఇండోనేషియా దేశంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది....

earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం

జకార్తా(ఇండోనేషియా):ఇండోనేషియా(Indonesia) దేశంలో సోమవారం ఉదయం భూకంపం(earthquake) సంభవించింది. భూకంపాలకు నిలయంగా మారిన ఇండోనేషియా దేశంలోని పశ్చిమ సుమత్రా సమీపంలోని పారియామన్(West Sumatra near Pariaman) వద్ద భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(United States Geological Survey) తెలిపింది. ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.8గా నమోదైంది.11.9 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.గత ఏడాది డిసెంబరు 14వతేదీన తూర్పు నుసా టెంగ్గర వద్ద సముద్ర గర్భంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సునామీ హెచ్చరిక జారీ చేశారు.


ఇండోనేషియాలో 2018వ సంవత్సరంలో సెప్టెంబరు 28వతేదీన సంభవించిన భూకంపంలో 2వేలమంది మరణించారు. 2004వ సంవత్సరంలో సుమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.1గా నమోదైంది. భూకంపం, సునామీల వల్ల 2,20,000మంది మరణించారు.


Updated Date - 2022-08-29T14:10:02+05:30 IST