పామాయిల్ ఎగుమతులపై నిషేధం...Indonesia సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-04-23T18:30:38+05:30 IST

పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో భారతదేశంలోనూ పామాయిల్ ధరలకు రెక్కలు రానున్నాయి....

పామాయిల్ ఎగుమతులపై నిషేధం...Indonesia సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో భారతదేశంలోనూ పామాయిల్ ధరలకు రెక్కలు రానున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారు అయిన ఇండోనేషియాలో ధరల పెరుగుదలను సొమ్ము చేసుకునేందుకు ఉత్పత్తిదారులు ఎగుమతుల వైపు మొగ్గుచూపుతుండటంతో ఆ దేశంలో వంటనూనెల కొరత ఏర్పడింది.దీంతో ఇండోనేషియాలో పామాయిల కొరతను పరిష్కరించడానికి ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను నిషేధించింది.‘‘వంట నూనె, వంట నూనెలకు సంబంధించిన ముడి పదార్థాలను ఎగుమతి చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది’’ అని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఒక ప్రకటనలో తెలిపారు.ఇండోనేషియాలో వంటనూనెలు సరసమైన ధరలకు సమృద్ధిగా ఉండేలా చేసేందుకు తాను పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించామని అధ్యక్షుడు చెప్పారు. 

Updated Date - 2022-04-23T18:30:38+05:30 IST