భారత్ నుంచి వచ్చే విదేశీయులపై నిషేధం.. సింగపూర్ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-04-24T02:07:15+05:30 IST

భారత్ లో గడిచిన నెల రోజులుగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపుతోంది. దీంతో మన దేశం నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే

భారత్ నుంచి వచ్చే విదేశీయులపై నిషేధం.. సింగపూర్ సంచలన నిర్ణయం

సింగపూర్: భారత్ లో గడిచిన నెల రోజులుగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపుతోంది. దీంతో మన దేశం నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారిపై పలుదేశాల్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మరికొన్ని దేశాలు కూడా అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ద్వీపదేశం సింగపూర్ కూడా భారత్ నుంచి వచ్చే విదేశీలయులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల చెన్నై నుంచి ఇక్కడకు 129 మందితో ఒక విమానం వచ్చింది. అందులో 12 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో గడిచిన 14 రోజుల్లో భారత్ ను సందర్శించిన లేక భారత్ లో ఉన్న విదేశీలయులకు సింగపూర్ వీసాలు ఇవ్వబోమని ఆ దేశ ఆరోగ్య మంత్రి బుడి సాడికిన్ తెలిపారు. అయితే భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న సింగపూర్ వాసులకు మాత్రం అనుమతులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2021-04-24T02:07:15+05:30 IST