పెరుగు వడ చేయడంలో ఇతడి స్టైలే వేరు.. చూశారంటే నోరెళ్లబెడతారు..

ABN , First Publish Date - 2022-05-19T18:53:37+05:30 IST

కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొందరు వ్యాపారులు విభిన్న రకాలుగా విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు తాము చేసే వంటకాలలో నాణ్యత పాటించడంతో పాటూ పని చేయడంలోనూ ప్రత్యేకతను...

పెరుగు వడ చేయడంలో ఇతడి స్టైలే వేరు.. చూశారంటే నోరెళ్లబెడతారు..

కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొందరు వ్యాపారులు విభిన్న రకాలుగా విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు తాము చేసే వంటకాలలో నాణ్యత పాటించడంతో పాటూ పని చేయడంలోనూ ప్రత్యేకతను కనబరుస్తుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ఎలాగైనా ఆ వంటకాలను రుచి చూడాలనిపిస్తుంటుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. పెరుగు వడ చేయడంలో అతడి స్టైల్‌ను చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఎలాగైనా ఆ వంటకాన్ని రుచి చూడాలని క్యూ కడుతున్నారు.


ఫ్లయింగ్ దహీ వడ పేరుతో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బడా సరాఫా అనే ప్రాంతంలో జోషి జి అనే వ్యక్తి.. పెరుగు వడను వినూత్నంగా అందిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ముందుగా ప్లేటులో వడ తీసుకుని, అందులో పెరుగు కలుపుతాడు. తర్వాత ప్లేట్‌ను గాలిలోకి ఎగరేస్తాడు. దీంతో పెరుగు ఎక్కడ కిందపడిపోతుందో అని అంతా అనుకుంటారు. కానీ విచిత్రంగా కొంచెం కూడా కిందపడకుండా చాకచక్యంగా ప్లేట్‌ను పట్టుకుంటాడు.

జలపాతం వద్ద స్టంట్ చేయాలని చూసిన యువకుడు.. మరుక్షణమే అతడి పరిస్థితి..


తర్వాత అందులో వివిధ రకాల మసాలా దినుసులను కలిపి.. మళ్లీ ఓ సారి గాలిలోకి ఎగరేస్తాడు. చివరగా అంతే స్టైల్‌గా పెరుగువడను కస్టమర్లకు అందిస్తాడు. 1977 నుంచి వంశపారంపర్యంగా తాము పెరుగు వడను అందిస్తున్నామని జోషి చెబుతున్నాడు. ప్లేట్ రూ.40కు అందిస్తున్నట్లు చెప్పాడు. ఇండోర్‌ వచ్చిన ఎవరైనా ఇక్కడి పెరుగు వడను రుచి చూసి వెళ్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రైలు నుంచి పిల్లలతో పాటూ కిందకు దూకేసిన మహిళ.. సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో..





Updated Date - 2022-05-19T18:53:37+05:30 IST