Indoreలో డెంగీ జ్వరాల కలకలం...వెయ్యికి చేరిన కేసులు

ABN , First Publish Date - 2021-11-20T15:08:00+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో డెంగీ జ్వరాలు కలకలం రేపుతున్నాయి....

Indoreలో డెంగీ జ్వరాల కలకలం...వెయ్యికి చేరిన కేసులు

 ఇండోర్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో డెంగీ జ్వరాలు కలకలం రేపుతున్నాయి. ఇండోర్ నగరంలో తాజాగా శుక్రవారం ఒక్కరోజే పదిమంది పిల్లలతో సహా 21 మందికి డెంగీ సోకింది. వర్షపునీరు నిల్వ ఉన్న ప్రాంతాల చుట్టుపక్కల నివాసముంటున్న వారు డెంగీ జ్వరాల బారిన పడుతున్నారని ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బీఎస్ సెటియా చెప్పారు. ఇండోర్ లో మొత్తం డెంగీ కేసుల సంఖ్య 1000కి చేరింది. నీటి నిల్వల వల్ల దోమలు విపరీతంగా వ్యాప్తిచెందడంతో ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు.ప్రస్తుతం 28 యాక్టివ్ డెంగీ కేసులు ఉన్నాయి. 


ఇండోర్ జిల్లాలో 15 మంది డెంగీ రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.గర్భిణులకు డెంగీ జ్వరమొస్తే వారిలో పిండం పెరుగుదల తగ్గి శిశువు తక్కువ బరువుతో పుట్టే అవకాశాలున్నాయని గైనకాలజిస్టులు చెప్పారు.వెక్టార్ ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ఈడిస్ ఈజిప్ట్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.డెంగీ జ్వరం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగితే ప్రాణాంతకమవుతుందని వైద్యులంటున్నారు.డెంగీ నివారణకు వీలుగా దోమలు వ్యాప్తి చెందకుండా యాంటీలార్వా ఆపరేషన్ చేపట్టారు.



Updated Date - 2021-11-20T15:08:00+05:30 IST