‘ఇంద్ర’ సర్వీసులు పునః ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-07T05:16:10+05:30 IST

కరోనా కాలంలో నిలిచిపోయిన ఇంద్ర బస్సులను పార్వతీపురం నుంచి విజయ వాడకు పునః ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ జాన్‌ సుందరం తెలిపారు.

‘ఇంద్ర’ సర్వీసులు పునః ప్రారంభం

పార్వతీపురంటౌన్‌, మార్చి 6: కరోనా కాలంలో నిలిచిపోయిన ఇంద్ర బస్సులను పార్వతీపురం నుంచి విజయ వాడకు పునః ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ జాన్‌ సుందరం తెలిపారు. శనివారం ఆయన స్థానిక డిపోలో ఉన్న నూతన ఇంద్ర బస్సులను పరిశీలించి మాట్లాడారు. ఇంద్ర ఏసీ బస్సుల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందన్న వైద్యనిపుణులు సూచనలు, సంస్థ ఉన్నతాధికా రుల ఆదేశాలను కరోనా సమయంలో పాటించామన్నారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇంద్ర బస్సును ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పార్వతీపురంలో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై విజయవాడకు మరుసరోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుందని, విజయవాడలో రాత్రి 9.20 గంటలకు ప్రారంభమై మరుసరోజు రోజు ఉదయం 9.20 గంటలకు చేరకుంటుందన్నారు. నూతనంగా ప్రారంభిస్తున్న ఇంద్ర బస్సులో కరోనా నివారణకు సంబంధించిన జాగ్రత్తలతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ముందుగా టిక్కెట్‌ బుక్‌ చేసుకోవాల్సిన వారు ఏపీఎస్‌ఆర్‌టీసీ డాట్‌ ఇన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చునన్నారు.  

 

Updated Date - 2021-03-07T05:16:10+05:30 IST