
హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (BJP) కార్యవర్గ సమావేశాల్లో భద్రతా లోపం బయటపడింది. ఈ సమావేశాలకు వచ్చిన నిఘా అధికారి శ్రీనివాసరావు (Srinivasarao)ను బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy) పట్టుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదని అన్నారు. అంతర్గత సమావేశంలోకి పోలీసులను పంపించి నిఘా పెట్టడం అనేది మంచి పద్ధతి కాదన్నారు. గతంలో టీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు ఎవరు ఇలా చేయలేదన్నారు. పోలీసు ఇంటలిజెన్స్ అధికారిని పట్టుకుని సీపీకి అప్పజెప్పామన్నారు. లోపల కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ బుక్‌ను ఫోటో తీసే ప్రయత్నం చేశారని, ఫోటోలన్నిటిని డిలీట్ చేయించామని ఇంద్రసేనారెడ్డి చెప్పారు.
ఇవి కూడా చదవండి