IDBIలో 1544 పోస్టులు

ABN , First Publish Date - 2022-06-03T17:47:29+05:30 IST

ముంబయిలోని ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి, 2022-23 సంవత్సరానికి గాను పీజీడీబీఎఫ్(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌) కోర్సులో ప్రవేశానికి ఉమ్మడి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను ఏడాది కాలానికి గానూ కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేస్తారు.

IDBIలో 1544 పోస్టులు

1. ఎగ్జిక్యూటివ్‌లు:1044

2. అసిస్టెంట్‌ మేనేజర్లు: 500


ముంబయిలోని ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Industrial Bank of India)(ఐడీబీఐ) అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి, 2022-23 సంవత్సరానికి గాను పీజీడీబీఎఫ్(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌) కోర్సులో ప్రవేశానికి ఉమ్మడి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను ఏడాది కాలానికి గానూ కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేస్తారు. 


ఏడాది సర్వీసు పూర్తయ్యాక అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్‌ వ్యవధిని మరో ఏడాది పొడిగిస్తారు. ఇలా మూడేళ్లు కాంట్రాక్ట్‌ పద్ధతిలో విజయవంతంగా పనిచేసిన వారికి బ్యాంక్‌ నిబంధనలను అనుసరించి బ్యాంక్‌ సెలెక్షన్‌ ప్రాసెస్‌ ద్వారా అసిస్టెంట్‌ మేనేజర్‌ ‘ఎ’ పోస్టుకు ఎంపిక చేస్తారు. ఇక పీజీడీబీఎఫ్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు తొలుత ఐడీబీఐ బ్యాంక్‌ మణిపాల్‌(బెంగళూరు), నిట్టే(గ్రేటర్‌ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి బ్యాం కింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఏడాది(9 నెలలు క్లాస్‌రూం+3 నెలలు ఇంటర్న్‌షిప్)పాటు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్)లో ట్రెయినింగ్‌ ఇస్తారు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం ఇస్తారు.


అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌/లాంగ్వేజ్‌లో డిప్లొమా/డిగ్రీ సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: 2022 ఏప్రిల్‌ 01 నాటికి ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీ(ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు మూడేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు; ఎక్స్‌సర్వీ‌స్‌మన్‌కు ఐదేళ్లు, 1984 దాడులలో నష్టపోయిన వారికి ఐదేళ్లు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ప్రీ రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 


పరీక్ష విధానం

పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో నాలుగు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. అవి...

1. లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ - 60 ప్రశ్నలు - 60 మార్కులు

2. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ - 40 ప్రశ్నలు - 40 మార్కులు

3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - 40 ప్రశ్నలు- 40 మార్కులు

4. జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ - 60 ప్రశ్నలు - 60 మార్కులు

  • పరీక్ష సమయం 2 గంటలు, నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. తప్పుగా గుర్తించి ప్రతి సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూడీ అభ్యర్థులకు రూ.200; ఇతరులు రూ.1000 చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 17

పరీక్ష తేదీలు: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు జూలై 09, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు జూలై 23

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

Updated Date - 2022-06-03T17:47:29+05:30 IST