మాట్లాడుతున్న రాష్ట్ర పారిశ్రామిక సంస్థ చైర్మన్ లక్ష్మీనారాయ
రాష్ట్ర పారిశ్రామిక సంస్థ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ
పెబ్బేరు,జనవరి24ః రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తానని రాష్ట్ర పారిశ్రామిక సంస్థ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పా టుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక రంగంను అభివృద్ది పరచడానికి సీఎం కేసీఆర్ తనకు చైర్మన్ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పారిశ్రామిక రంగంలోని సమస్యలు తమ దృష్టికి వస్తే పరిష్కరించడానికి ప్రయత్నిస్తానన్నారు. అనంతరం ఆర్యవైశ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నా యకులు నాగబంది యాదగిరి, గొనూరు యాదగిరి, బుచ్చయ్యశెట్టి, రమేష్, జయప్రకాష్, హరినాథ్, శ్రీనివాసులు, సుబ్బయ్య, బాలచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.