టీడీపీలోకి పారిశ్రామికవేత్త గంటా

ABN , First Publish Date - 2022-07-02T09:05:53+05:30 IST

టీడీపీలోకి పారిశ్రామికవేత్త గంటా

టీడీపీలోకి పారిశ్రామికవేత్త గంటా

రాజంపేట ఎంపీ అభ్యర్ధి అని పార్టీ వర్గాల్లో ప్రచారం

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి శుక్రవారం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బెంగుళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయన 17-18 సంవత్సరానికి రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకొన్నారు. తన వ్యాపార కార్యకలాపాల ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు సమీప బంధువు. డీకే సతీమణి, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సోదరికి నరహరి అల్లుడు అవుతారు. రాజంపేట లోక్‌సభ స్థానానికి ఆయన టీడీపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరెడ్డి, నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి, బత్యాల చెంగల్రాయుడు, దమ్మాలపాటి రమేశ్‌, చల్లా బాబు రెడ్డి తదితరులు ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


తటస్థులకు ఆహ్వానం: చంద్రబాబు
టీడీపీలోకి తటస్థులకు ఆహ్వానం పలుకుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. ‘‘వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి. టీడీపీలో చేరి ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలి. ఇప్పటికే అనేక మంది వస్తున్నారు. విద్యావంతులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా టీడీపీలోకి రావాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నరహరి మీడియాతో మాట్లాడారు. టీడీపీ కోసం ఒక కార్యకర్త మాదిరిగా పనిచేస్తానని అన్నారు.

Updated Date - 2022-07-02T09:05:53+05:30 IST