బీజేపీ హయాంలో కుదేలైన పరిశ్రమలు

ABN , First Publish Date - 2022-05-20T04:40:21+05:30 IST

కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, సుమారు 5 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని విశాఖ ఉక్కు పోరాట కమిటీ కో కన్వీనర్‌ కె.సత్యనారాయణ విమర్శించారు.

బీజేపీ హయాంలో కుదేలైన పరిశ్రమలు
రిలే దీక్షలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న సత్యనారాయణ

ఉక్కు పోరాట కమిటీ కో కన్వీనర్‌ సత్యనారాయణ 

కూర్మన్నపాలెం, మే 19: కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, సుమారు 5 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని  విశాఖ ఉక్కు పోరాట కమిటీ కో కన్వీనర్‌ కె.సత్యనారాయణ విమర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆద్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో 462 వరోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉద్యోగులనుద్దేశించి గురువారం ఆయన మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పుల కంటే ఇప్పటి ప్రభుత్వాలు మూడు రెట్లు అధికంగా చేసి, దేశ ప్రజలను దరిద్రులుగా మార్చారన్నారు. దేశ సంపదను, శ్రమ దోపిడీని నివారించడానికి ఐక్య ఉద్యమాలే శరణ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఉక్కు అంశా న్ని చర్చించి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రజా వ్యతిరేక చర్యలపై దేశ ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు. విశాఖ ఉక్కు జోలికి వస్తే ప్రభుత్వాలకు కార్మి క శక్తి రుచి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అయోధ్యరామ్‌, వేములపాటి ప్రసాద్‌, గంగవరం గోపి, జి.ఆనంద్‌, సన్యాసిరావు, పరంధామయ్య, వెంకటేశ్వరరావు, రాథోడ్‌, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T04:40:21+05:30 IST