చర్మం ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా...

ABN , First Publish Date - 2020-09-17T21:08:52+05:30 IST

వర్షాకాలంలో పలురకాల ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో చర్మం దెబ్బతినకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేమిటంటే...

చర్మం ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా...

ఆంధ్రజ్యోతి(17-09-2020)

వర్షాకాలంలో పలురకాల ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో చర్మం దెబ్బతినకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేమిటంటే...


వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. మీరు ధరించే దుస్తులు, ముఖ్యంగా లోదుస్తులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.


ఎల్లవేళలా శరీరం పొడిగా ఉండేట్టు జాగ్రత్త వహించాలి. బయటకు వెళ్లేటప్పుడు వర్షం పడుతున్నా, పడకపోయినా గొడుగు లేదా రెయిన్‌ కోట్‌ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. 


మీ దుస్తులు, మీరు ఉపయోగించే వస్తువులు వేటినీ ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఒకరి దుస్తులు ఇంకొకరు వేసుకుంటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. 


వర్షాకాలంలో డైట్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే మసాలా ఫుడ్‌ తినొద్దు. పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, బాదం, పెరుగు, దంపుడు బియ్యం, వెల్లుల్లి, ఓట్స్‌ వంటివి తినడం ఉత్తమం. వీటిని తినడం వల్ల చర్మం సున్నితంగా తయారవుతుంది. 


దాహంగా అనిపించకపోయినా నీళ్లు బాగా తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చర్మవ్యాధులు రాకుండా రోజంతా వేడి నీళ్లు కొద్ది కొద్దిగా తాగుతుండాలి. 


వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్లు సోకకుండా యాంటీ-ఫంగల్‌, యాంటీ-బాక్టీరియల్‌ క్రీములను వాడాలి.. ఏవైనా ఎలర్జీలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. వర్షాకాలంలో ఇంట్లో హవాయి చెప్పులు, కాటన్‌ సాక్స్‌ వంటివి వేసుకోవాలి. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి.


డయాబెటిస్‌ తదితర వ్యాధిగ్రస్థులు చర్మం ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. మధుమేహం ఎక్కువైతే దాని ప్రభావం చర్మంపై పడుతుంది. శరీరంపైన, లోపల పుండ్లు లాంటివి ఉంటే ఇన్‌ఫెక్షన్లు తీవ్రతరమవుతాయి. వర్షంలో తడిసిన జుట్టును వెంటనే తుడుచుకోవాలి.

Updated Date - 2020-09-17T21:08:52+05:30 IST