Rajouri army camp:ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల దాడి...ఇద్దరు ఉగ్రవాదుల హతం,ముగ్గురు సైనికుల వీరమరణం

ABN , First Publish Date - 2022-08-11T14:06:00+05:30 IST

ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ సరిహద్దుల్లోని ఆర్మీ క్యాంప్‌లోకి చొరబడేందుకు(Infiltration bid) చేసిన యత్నాన్ని ఆర్మీ అధికారులు తిప్పికొట్టిన ఘటన...

Rajouri army camp:ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల దాడి...ఇద్దరు ఉగ్రవాదుల హతం,ముగ్గురు సైనికుల వీరమరణం

శ్రీనగర్(జమ్మూకశ్మీర్): ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ సరిహద్దుల్లోని ఆర్మీ క్యాంప్‌లోకి చొరబడేందుకు(Infiltration bid) చేసిన యత్నాన్ని ఆర్మీ అధికారులు తిప్పికొట్టిన ఘటన జమ్మూకశ్మీరులోని రాజౌరి(Rajouri) జిల్లాలో గురువారం జరిగింది.గురువారం ఉదయం రాజౌరీ జిల్లా దర్హాల్ ప్రాంతంలోని పర్గల్‌లో ఉన్న ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ఇద్దరు ఉగ్రవాదులు యత్నించారు.దీంతో సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు(two terrorists killed) హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ క్యాంపులోని ఐదుగురు సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించారు.తీవ్రంగా గాయపడిన ముగ్గురు సైనికులు వీరమరణం చెందారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నం, కాల్పుల ఘటనతో రాజౌరి జిల్లాలో సైనికులు అప్రమత్తమయ్యారు. 


దర్హాల్ ప్రాంతంలో సైనికులు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.గురువారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పర్గల్ ఆర్మీ క్యాంపులో(army camp at Pargal near Budh Kanadi in Darhal area of Rajouri district) ఫెన్సింగును దాటి లోపలకు వచ్చేందుకు యత్నించగా, సెంట్రీగార్డు అప్రమత్తమై కాల్పులు జరిపాడు.ఈ ఘటనతో అదనపు సైనిక బలగాలను రంగంలో దించామని జమ్మూ జోన్ అదనపు డీజీపీ ముకేష్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదులు ఆర్మీ శిబిరంలోకి చొరబడి ఆత్మాహుతి దాడి(suicide attack) చేసేందుకు చేసిన యత్నం సెంట్రీగార్డు అప్రమత్తంగా( alert sentry on guard duty) ఉండటంతో తప్పిందని పోలీసులు చెప్పారు.స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా ఉగ్రవాదుల దాడితో జమ్మూ కశ్మీరులో హైఅలర్ట్ ప్రకటించారు. రోడ్లపై వాహనాల తనిఖీలు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-11T14:06:00+05:30 IST