ఇన్ఫినిక్స్‌ నోట్‌ 17 నిమిషాల్లో ఫుల్‌చార్జింగ్‌

ABN , First Publish Date - 2022-05-21T06:59:09+05:30 IST

ఇన్ఫినిక్స్‌ నోట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ కలిగిన మొబైల్‌ను విడుదల చేసింది. కేవలం పదిహేడు నిమిషాల్లో ఫోన్‌లో వందశాతం చార్జింగ్‌ దీని ప్రత్యేకత.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 17 నిమిషాల్లో ఫుల్‌చార్జింగ్‌

న్ఫినిక్స్‌ నోట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ కలిగిన మొబైల్‌ను విడుదల చేసింది. కేవలం పదిహేడు నిమిషాల్లో ఫోన్‌లో వందశాతం చార్జింగ్‌ దీని ప్రత్యేకత. 12 సిరీస్‌లో భాగంగా ‘ఇన్ఫినిక్స్‌ నోట్‌ 12 వీఐపీ’లో సదరు సదుపాయం ఉంది. 120హెచ్‌జెడ్‌ డిస్‌ప్లేకి తోడు 108 ఎంపీ కెమెరా ఉన్నాయి. అత్యంత పలచనిది తమ ఫోన్‌ అని ఇన్ఫినిక్స్‌ చెప్పుకొంటోంది. ఏరోస్పేస్‌ - గ్రేడ్‌ అలా్ట్ర -థిన్‌ గ్లాస్‌ ఫైబర్‌ మెటీరియల్‌ని కార్బన్‌ ఫైబర్‌ని గట్టిపర్చేందుకు ఉపయోగించింది. బరువు 199 గ్రాములు. 4500 ఎంఎహెచ్‌ బ్యాటరీ అదీ 120 వాట్ల హైపర్‌ చార్జ్‌ సపోర్ట్‌ ఉంది. 18 టెంపరేచర్‌ సెన్సర్లు ఫోన్‌ లోపల ఉన్నాయి. 103 ప్రొటెక్షన్‌ ఫీచర్లు ఫోన్‌, చార్జర్లలో ఉన్నాయి. 800 చార్జ్‌ సైకిల్స్‌ తరవాత కూడా బ్యాటరీ కెపాసిటీ 85 శాతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. మెయిన్‌ కెమెరా 108ఎంపీ. తోడుగా 13ఎంపీ అలా్ట్రవైడ్‌ యాంగిల్‌ కెమెరా అలాగే లేజర్‌ ఏఎఫ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 16ఎంపీ. 256 జీబీకి తోడు కేయన్నీ గ్రే, ఫోర్స్‌ బ్లాక్‌  రంగుల్లో  ఇది లభ్యం కానుంది. దీని రేటు 299 డాలర్లు.

Updated Date - 2022-05-21T06:59:09+05:30 IST