ఎస్సారెస్పీలోకి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2020-10-20T06:22:17+05:30 IST

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రధాయిని శ్రీ రాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 112859 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపారు

ఎస్సారెస్పీలోకి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

25 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల


మెండోర, అక్టోబరు 19: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రధాయిని శ్రీ రాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 112859 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపారు. సోమవారం ఉదయం 88009 క్యూసెక్కుల వరద తగ్గడంతో 18 గేట్ల ద్వా రా 75వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. మధ్యా హ్నం 112859 క్యూసెక్కుల వరద పెరగడంతో 25 గేట్ల ద్వారా ఒక ల క్ష క్యూసెక్కుల నీటిని గోదావరిలో వదిలారు. ప్రాజెక్టు నీటిమట్టం గరి ష్ఠస్థాయికి చేరడంతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని గేట్ల ద్వారా కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు.


ప్రాజెక్టు నుంచి ఎస్కేప్‌ ఐదు గేట్ల ద్వారా 5500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చే స్తూ కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 500 క్యూసెక్కులు, లక్ష్మీకాలువకు 150 క్యూసెక్కులు, వరదకాలువకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ట్టు వివరించారు. ప్రాజెక్టు నుంచి ఆవిరి రూపంలో 557 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 152 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో పోతుందని ఈఈ రామారావు తెలిపారు. ప్రాజె క్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90టీఎంసీ)లు సోమవా రం సాయంత్రానికి 1091 అడుగులు (90టీఎంసీ)ల నీటి నిల్వ ఉంద ని, జూన్‌ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి 323..39టీఎంసీల నీరు వచ్చి చేరిందని, 197.51 టీఎంసీల మిగులు జలాలను గోదావరిలోకి విడు దల చేయడం జరిగిందని ఈఈ తెలిపారు.

Updated Date - 2020-10-20T06:22:17+05:30 IST