Deodorant Advertisement: ఇదెక్కడి దిక్కుమాలిన డబుల్ మీనింగ్ యాడ్.. తొలగించాలని కేంద్రం ఆదేశాలు

ABN , First Publish Date - 2022-06-04T23:04:15+05:30 IST

ఈ మధ్య కాలంలో వ్యాపార ప్రకటనల్లో వివాదాస్పద ధోరణి రోజురోజుకూ పెరిగిపోతోంది. కాంట్రవర్షియల్‌గా యాడ్‌ను చిత్రీకరిస్తేనే జనం ఆసక్తిగా చూస్తారనే దిక్కుమాలిన ఆలోచనలతో..

Deodorant Advertisement: ఇదెక్కడి దిక్కుమాలిన డబుల్ మీనింగ్ యాడ్.. తొలగించాలని కేంద్రం ఆదేశాలు

ఈ మధ్య కాలంలో వ్యాపార ప్రకటనల్లో వివాదాస్పద ధోరణి రోజురోజుకూ పెరిగిపోతోంది. కాంట్రవర్షియల్‌గా యాడ్‌ను చిత్రీకరిస్తేనే జనం ఆసక్తిగా చూస్తారనే దిక్కుమాలిన ఆలోచనలతో కొన్ని వ్యాపార సంస్థలు దిగజారి మరీ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాయి. డబుల్ మీనింగ్ పైత్యాన్ని యాడ్స్‌లో జొప్పించి ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేసుకున్న ఓ కంపెనీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గుజరాత్‌కు చెందిన Adjavis Venture Limited కంపెనీ Deodorantను విక్రయిస్తుంటుంది. Layer’r’s Shot అనే పేరుతో మార్కెట్లో దొరికే ఈ కంపెనీ డియోడ్రెంట్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు తాజాగా రెండు యాడ్స్‌ను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో, టీవీ ఛానళ్లలో విడుదల చేసింది. ఈ రెండు యాడ్స్ పెను దుమారానికి తెరలేపాయి. సోషల్ మీడియాలో ఈ యాడ్స్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘Rape Culture’ను ప్రోత్సహించే విధంగా ఈ రెండు యాడ్స్ ఉన్నాయని, డియోడ్రెంట్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు మహిళలపై ఇంతలా దిగజారి ‘Rape Jokes’ వేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.



కేంద్ర సమాచార శాఖ కూడా ఈ వ్యాపార ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదాస్పద యాడ్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అడ్వర్‌టైజింగ్ కోడ్ ప్రకారం ఈ వ్యాపార ప్రకటనలపై విచారణ జరుపుతామని కేంద్రం స్పష్టం చేసింది. (Layer'r Shot) Deodorant advertisement దేశంలో Rape Mentalityని ప్రోత్సహించే విధంగా ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ చెప్పారు. ఈ యాడ్‌ ప్రమోట్ చేసిన కంపెనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఇప్పటికే నోటీసులు పంపినట్లు ఆమె తెలిపారు. యాడ్‌ను అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో తొలగించాలని స్వాతి మలివాల్ ఆదేశాలు జారీ చేశారు.



Updated Date - 2022-06-04T23:04:15+05:30 IST