దేవీ కటాక్షం కోసం దీక్ష

Oct 14 2021 @ 00:00AM

పంజాబ్‌ రాష్ట్రంలో దసరా వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. అక్కడి ప్రజలు శక్తీదేవిని పూజిస్తారు. అష్టమి రోజున రాత్రంతా భక్తి పాటలు పాడుతూ జాగారం చేస్తారు. తొమ్మిది మంది బాలికలను పిలిచి కన్యా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి దీక్ష ప్రారంభిస్తారు. ఆ బాలికలను కంజిక అంటారు. సకల సౌభాగ్యాలు చేకూరాలని అలా తొమ్మిది మంది బాలికలను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. వాళ్లకు ఇష్టమైన బహుమతులు అందిస్తారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.