12 మంది మహిళలకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి.. డాక్టర్‌ పరార్

Published: Sat, 26 Mar 2022 17:51:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
12 మంది మహిళలకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి.. డాక్టర్‌ పరార్

భువనగిరి: వైద్యో నారాయణో హరీ.. అన్న నానుడికి అర్థం మారిపోతోంది. కనిపించని దేవుళ్లకన్నా.. ప్రాణం పోసే వైద్యులనే దేవుళ్లుగా భావిస్తుంటారు. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మంది వైద్యులు యమభటులుగా తయారయ్యారు. రోగుల పాలిట యమకింకరులవుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. భువనగిరి జిల్లా ఆస్పత్రిలో ఓ వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అంతేకాకుండా వైద్యం చేయకుండా ఆసుపత్రి దాటి వెళ్లిపోయారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఆసుపత్రి సిబ్బంది మిన్నకుండి పోయారు. ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ కోసం కొందరు మహిళలు భువనగిరి ఆసుపత్రికి వచ్చారు. ముందుగా అనుకున్న పక్రారం ఆ రోజే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆపరేషన్‌కు ముందు 12 మంది మహిళలకు డాక్టర్‌ మత్తు ఇంజక్షన్లు ఇచ్చాడు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. సదరు డాక్టర్ మత్తు ఇచ్చిన తర్వాత ఆపరేషన్‌ చేయనని వెళ్లిపోయాడు. ఇప్పటివరకు ఆస్పత్రి వైద్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి ఎదుట బంధువుల పడిగాపులుకాస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో మహిళల కుటుంబసభ్యులు  ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.