గాయపడిన అడవి ఏనుగు మృతి

ABN , First Publish Date - 2021-01-22T12:51:22+05:30 IST

వేటగాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ ఏనుగు చికిత్స పొందుతూ మరణించిన ఘటన ....

గాయపడిన అడవి ఏనుగు మృతి

చెన్నై (తమిళనాడు): వేటగాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ ఏనుగు చికిత్స పొందుతూ మరణించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ముదుమలై టైగర్ రిజర్వు ఫారెస్టులో వెలుగుచూసింది. కొందరు వేటగాళ్లు అడవిలో సంచరిస్తున్న ఓ ఏనుగును తీవ్రంగా గాయపర్చారు. చెవి, వెనుకభాగంలో తీవ్ర గాయాలైన ఏనుగు మాసినగుడి, బొక్కపురం అటవీ ప్రాంతాల్లో తిరుగుతుండగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. గాయపడిన ఏనుగుకు మందులు కలిపిన పండ్లను ఆహారంగా అందించారు. యాంటీబయాటిక్సు తో ఏనుగుకు చికిత్స చేసినా అది బలహీనంగా మారింది. దీంతో గాయపడిన ఏనుగును చికిత్స కోసం వన్యప్రాణుల సహాయ శిబిరానికి తరలించేందుకు ఏనుగును ట్రక్కుపై ఎక్కించారు. ఏనుగును తీసుకువెళుతుండగా మరణించింది. ఏనుగుకు అయిన గాయం వల్ల ఊపిరితిత్తుల్లో పస్ ఏర్పడి మరణించిందని కళేబరం పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని పశువైద్యాధికారులు చెప్పారు.ఏనుగు మృతితో మావటి అయిన అటవీశాఖ ఉద్యోగి బెల్లాన్ కన్నీటిపర్యంతమయ్యారు. 

Updated Date - 2021-01-22T12:51:22+05:30 IST