ఆరంగిపేటలో కొట్లాట!

ABN , First Publish Date - 2021-06-15T05:14:14+05:30 IST

ఆరంగిపేటలో అమ్మవారి ఆలయ భూముల కు సంబంధించి వివాదం రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సోమవారం ఇరువర్గాలకు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పది మంది గాయాలపా లయ్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో అమ్మవారి ఆలయానికి సంబంధించి ఐదు ఎకరా ల వరకూ భూమి ఉంది. ఆ భూమిని ఒ

ఆరంగిపేటలో కొట్లాట!
రిమ్స్‌లో చికిత్సపొందుతున్న బాధితులు


పదిమందికి గాయాలు

ఆలయ భూముల వివాదమే కారణం

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/గార: ఆరంగిపేటలో అమ్మవారి ఆలయ భూముల కు సంబంధించి వివాదం రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సోమవారం ఇరువర్గాలకు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పది మంది గాయాలపా లయ్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో అమ్మవారి ఆలయానికి సంబంధించి ఐదు ఎకరా ల వరకూ భూమి ఉంది. ఆ భూమిని ఒక సామాజికవర్గం వారు సాగుచేసి ఫలసా యంలో కొంత భాగాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆ భూమిలో కొంత భాగాన్ని ఇస్తే సాగు చేస్తామని మరో సామాజికవర్గం వారు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం లో సోమవారం వారి మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారితీసింది. కర్రలు, రాళ్లతో కొట్టుకోవడంతో పది మందికి గాయాలయ్యాయి. సమాచారమందు కున్న గార పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సోమవారం గ్రామాన్ని డీఎస్పీ మహేంద్ర, సీఐ అంబేడ్కర్‌లు సందర్శించారు. ఘర్షణకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలిస్‌ పికెట్‌ కొనసాగుతోందని... కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. రిమ్స్‌లో చికిత్సపొం దుతున్న బాధితులను జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మోనటరింగ్‌ కమిటీ సభ్యులు కంఠ వేణు పరామర్శించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. డి.గణేష్‌, మిస్కా కృష్ణయ్య,  రాణా శ్రీనివాస్‌ మాదిగ పరామర్శించిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొన్నట్టు డీఎస్పీ మహేంద్ర సోమవారం రాత్రి విలేఖర్ల సమావేశంలో తెలిపారు.






Updated Date - 2021-06-15T05:14:14+05:30 IST