ప్రత్యేక డీఎస్సీలో అన్యాయం జరిగింది’

ABN , First Publish Date - 2020-08-09T11:35:47+05:30 IST

జిల్లాలో బధిర (మోగ, చెముడు) విద్యార్థులకు బోధించే టీచర్ల నియామకాలకు గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ప్రత్యేక డీఎస్సీ ..

ప్రత్యేక డీఎస్సీలో అన్యాయం జరిగింది’

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 8 : జిల్లాలో బధిర (మోగ, చెముడు) విద్యార్థులకు బోధించే టీచర్ల నియామకాలకు గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో టెట్‌ మార్కులను కలపకపోవడం వల్ల ఉ ద్యోగ ఎంపికల్లో నష్టపోయినట్టు తాడేపల్లిగూడెం మండలం ఉప్పర గూ డెంకు చెందిన ఒక అభ్యర్థి వాపోయాడు. శనివారం ఈ మేరకు పత్రికలకు పంపిన సమాచారంలో తనకు స్పెషల్‌ డీఎస్సీలో 51.5 మార్కులు, ఏపీ టెట్‌లో 100 మార్కులు రాగా ఉద్యోగ నియామకాల్లో మాత్రం టెట్‌కు వెయిటేజీ ఇవ్వకుండా భర్తీ చేశారని ఆరోపించారు.


తాను ఐఇఆర్‌టీ టీచ రుగా పెంటపాడు, నిడమర్రు మండలాల్లో రెండేళ్లు పని చేశానని, సర్వీసు వెయిటేజీని ఇవ్వడానికి విద్యాశాఖ నిరాకరించడం వల్ల ఉద్యోగానికి ఎంపిక కాలేకపోయానని వివరించారు. దీనిపై డీఈవో సీవీ రేణుక వివరణ ఇస్తూ ప్రత్యేక ఉపాధ్యాయుల ఎంపిక జాబి తాను పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయం నుంచే నేరుగా విడుదల చేశారని, ఇందులో జిల్లా విద్యాశాఖ ప్రమేయమే లేదన్నారు. టెట్‌ వెయిటేజీ, గత ఉద్యోగ అనుభవాలకు వెయి టేజీ కలిపి అర్హుల జాబితాను ప్రకటించారన్నారు. ఇదే తరహా ఫిర్యాదును మరో అభ్యర్థి పంపించారని, వీటి లో వాస్తవాలు లేవన్నారు.  

Updated Date - 2020-08-09T11:35:47+05:30 IST