టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం

ABN , First Publish Date - 2022-08-14T07:53:58+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను అన్యాయానికి గురిచేస్తూ బతుకు లేకుండా చేస్తోందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం

ఉద్యమకారులనూ పట్టించుకోవడంలేదు: షర్మిల


దౌల్తాబాద్‌/మహబూబ్‌నగర్‌/మద్దూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను అన్యాయానికి గురిచేస్తూ బతుకు లేకుండా చేస్తోందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 121వ రోజు శనివారం వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో, నారాయణపేట జిల్లా  మద్దూరు మండలం దమగ్నాపూర్‌, నాగిరెడ్డిపల్లిల్లో కొనసాగింది.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడంలేదని, నాగరాజు అనే ఉద్యమకారుడు రెండు కాళ్లు, ఒక చేయి పోగొట్టుకుంటే ఇంతవరకూ అతడికి న్యాయం చేయలేదని ఆరోపించారు.  వైఎస్సార్‌టీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు వైఎస్సార్‌ సంక్షేమ పాలన అందిస్తామని, కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పారు. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండల పరిధిలోని గోకఫస్లాబాద్‌లో టీఆర్‌ఎ్‌సకు చెందిన వెంకట్రామ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డితో పాటు సుమారు 30 మంది కార్యకర్తలు షర్మిల సమక్షంలో వైఎ్‌సఆర్‌టీపీలో చేరారు.

Updated Date - 2022-08-14T07:53:58+05:30 IST