రాజకీయ పదవుల్లో గిరిజనులకు అన్యాయం

ABN , First Publish Date - 2021-07-24T05:14:41+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన పదవుల పందేరంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రానున్న రోజుల్లోనైనా న్యాయం చేయాలని గిరిజన సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సీదిరి అప్పలరాజును స్థానిక వైసీపీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు.

రాజకీయ పదవుల్లో గిరిజనులకు అన్యాయం
మంత్రికి వినతిపత్రం అందిస్తున్న గిరిజన సంఘ నేతలు

గిరిజన సంఘ నాయకులు

పలాస, జూలై 23 : రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన పదవుల పందేరంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రానున్న రోజుల్లోనైనా న్యాయం చేయాలని గిరిజన సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సీదిరి అప్పలరాజును స్థానిక వైసీపీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ నాయ కులు, ఆదివాసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సవర జగన్నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల 137 వివిధ పదవులు ప్రభుత్వం ఇచ్చిందని, అందులో గిరిజనులకు ప్రాధాన్యత లేకపోవడం దుర దృష్టకరమన్నారు. వచ్చేనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జిల్లాలో ఎక్కడ నిర్వహిస్తారో ప్రకటించి, ఘనంగా నిర్వహించాలని కోరారు. మంత్రిని కలుసుకున్న వారిలో ఆదివాసీ సంఘ నాయకులు సవర మోహనరావు, రామారావు, విజయ్‌, చిత్రశేను, సవర సీతారాం తదితరులు ఉన్నారు.

 

Updated Date - 2021-07-24T05:14:41+05:30 IST