అగ్నిపథ్‌తో యువతకు అన్యాయం

ABN , First Publish Date - 2022-06-28T04:32:30+05:30 IST

అగ్నిపథ్‌ పథకం ద్వారా యువతకు అన్యాయం జరుగుతోందని మద్దూర్‌ జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అగ్నిపథ్‌తో యువతకు అన్యాయం
మక్తల్‌లో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మద్దూర్‌, జూలై 27 : అగ్నిపథ్‌ పథకం ద్వారా యువతకు అన్యాయం జరుగుతోందని మద్దూర్‌ జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ పద్దతిన సైనికుల ఎంపిక చేసేందుకు కేంద్రం అగ్నిపథ్‌ పథ కం అమలు చేయడం రక్షణ రంగంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోనేందుకు బీజేపీ కుటిల యత్నమేనన్నారు. నాలుగేళ్ల కాలంలోనే వారిని ఇంటికి పంపించే యత్నం చేయడంతో ఆ పథకం ద్వారా ఎంపికైన ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఉపాధి కోల్పోవడం జరుగుతోందని వెంటనే ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీపీ సంజీవ్‌, నాయకులు నర్సింహా, జనార్ధన్‌, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, బాబు, మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

మక్తల్‌ : కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు వాకిటి శ్రీహరి, రాజుల ఆశి రెడ్డి మాట్లాడుతూ అగ్నిపథ్‌ను రద్దు చేయాలని మాజీ సైనికులు ఎన్నో సలహాలు ఇచ్చినా కేంద్రం పెడచెవిన పెడుతుందన్నారు. అనంతరం డీటీ కాళప్పకు వినతిపత్రం అందించారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సిములు, మక్తల్‌, ఊట్కూ రు, మాగనూరు, నర్వ మండల అధ్యక్షులు గణేష్‌ కుమార్‌, విజ్ఞేష్‌, ఆనంద్‌గౌడ్‌, చెన్నయ్యసాగర్‌, పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు నారాయణ, వెంకటేష్‌, నరేందర్‌, గోవర్దన్‌, నూరుద్దీన్‌, ఫయాజ్‌, అబ్దుల్‌ రహెమాన్‌, శ్రీనివాస్‌రెడ్డి, రంజిత్‌కుమార్‌రెడ్డి, రాజేందర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-28T04:32:30+05:30 IST