జైల్లో మహిళా ఖైదీల పనికి పోలీసుల మైండ్ బ్లాక్.. ఇంతకూ వాళ్లు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-01-30T23:46:16+05:30 IST

జైలు జీవితం గడుపుతున్న ఇద్దరు మహిళా ఖైదీలు చేసిన పనికి పోలీసుల మైంబ్ బ్లాక్ అయింది. దీంతో అధికా

జైల్లో మహిళా ఖైదీల పనికి పోలీసుల మైండ్ బ్లాక్.. ఇంతకూ వాళ్లు ఏం చేశారంటే..

ఇంటర్నెట్ డెస్క్: జైలు జీవితం గడుపుతున్న ఇద్దరు మహిళా ఖైదీలు చేసిన పనికి పోలీసుల మైంబ్ బ్లాక్ అయింది. దీంతో అధికారులు వాళ్ల వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కోర్టు.. ఆ ఖైదీలకు షాకిచ్చింది. స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


జర్మనీకి చెందిన ఇద్దరు మహిళలు వేరు వేరు నేరాల వల్ల జైలు జీవితం గడుపుతున్నారు. ఒకే సెల్‌లో ఉంటున్న ఈ ఇద్దరు మహిళల మధ్య మనస్పర్థలు వచ్చాయి. తాజాగా ఆ మనస్పర్థలు కాస్తా గొడవలుగా మారాయి. దీంతో భోజనంలో భాగంగా ఇచ్చిన ఆహార పదార్థాలను ఒకరిపై మరొకరు విసురుకున్నారు. అనంతరం ఖాళీ ప్లేట్స్‌తో కొట్టుకున్నారు. ఖైధీల గొడవ గురించి తెలుసుకుని అక్కడి అధికారుల షాకయ్యారు. అనంతరం క్రమశిక్షణగా లేని కారణంగా వారిపై మరో కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఆ మహిళా ఖైధీలకు షాకిచ్చింది. ఒకరికి 2700 యూరోల ఫైన్ విధించగా.. మరొకరికి 1800 యూరోల జరిమానా విధించింది. అంతేకాకుండా జరిమానా కట్టలేకపోతే.. అదనంగా 180 లేదా 120 రోజుల జైలు జీవితాన్ని అదనంగా గడపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 




Updated Date - 2022-01-30T23:46:16+05:30 IST