మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలిక.. డాక్టర్ చేసిన ఇంజెక్షన్‌తో దారుణం.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-30T20:35:29+05:30 IST

ఆ బాలిక వయసు 13 సంవత్సరాలు.. గత మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతోంది..

మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలిక.. డాక్టర్ చేసిన ఇంజెక్షన్‌తో దారుణం.. చివరకు..

ఆ బాలిక వయసు 13 సంవత్సరాలు.. గత మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తమ గ్రామంలోనే ఉన్న ఓ క్లినిక్‌కు తీసుకెళ్లారు.. ఆ బాలికను పరీక్షించిన వైద్యుడు ఓ ఇంజెక్షన్ చేశాడు.. దీంతో ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించింది.. నోటి నుంచి నురగ వస్తుండడంతో ఆ బాలికను కుటుంబ సభ్యులు వెంటనే టౌన్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.. అప్పటికే ఆ బాలిక మృతి చెందింది.. బాలిక మృతి గురించి తెలుసుకున్న నిందితుడు పరారీలో ఉన్నాడు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

52 ఏళ్ల మహిళపై అత్యాచారం.. పరువు తీస్తానని బెదిరించి రూ.30 లక్షలు దోపిడీ.. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో..


బార్మర్ జిల్లాలోని ధనౌ గ్రామానికి చెందిన లాధారం చౌతాన్ మనవరాలు ధురీ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీంతో ధురీని కుటుంబ సభ్యులు గ్రామంలోనే ఉండే  వైద్యుడు హీరారామ్ దగ్గరకు గురువారం సాయంత్రం తీసుకెళ్లారు. ఆ బాలికను పరీక్షించిన హీరారామ్ రెండు ఇంజక్షన్లు చేశాడు. అనంతరం ఒక్కసారిగా ఆ బాలిక ఆరోగ్యం క్షీణించింది. ఆ అమ్మాయి నోట్లోంచి నురగ రావడం మొదలైంది. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు ధురీని వెంటనే బార్మర్‌కు తీసుకెళ్లేందుకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోనే ధురీ మరణించింది. బాలిక చనిపోయినట్టు తెలుసుకున్న హీరారమ్ పరారీలో ఉన్నాడు. 


బాలిక మృతిపై సమాచారం అందుకున్న బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని క్లినిక్ ఎదుట ఉంచి ధర్నాకు దిగారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 

Updated Date - 2022-09-30T20:35:29+05:30 IST