ఫార్మా రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2022-06-27T06:33:34+05:30 IST

ఫార్మాస్యూటికల్స్‌ తయారీలో నూతన ఆవిష్కరణలు, సరికొత్త పద్ధతులు పాటించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు.

ఫార్మా రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని

డాబాగార్డెన్స్‌, జూన్‌ 26: ఫార్మాస్యూటికల్స్‌ తయారీలో నూతన ఆవిష్కరణలు, సరికొత్త పద్ధతులు పాటించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో ఫార్మా రంగంలో నూతన తయారీ పద్ధతులు, సమర్ధవంతమైన అమలు, నియంత్రణ అనే ఆంశంపై జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీ యాజమాన్యం ఏర్పాటు చేసిన చర్చా వేదికకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫార్మా రంగానికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. ఫార్మా పరిశ్రమ నిర్వహణలో అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, కాలుష్య నివారణకు పూర్తి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫార్మారంగ అభివృద్ధికి కావలసిన అన్ని రకాల మానవ వనరులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీజీ రవిశంకర్‌ నారాయణ, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-06-27T06:33:34+05:30 IST