యువ రైతుకు ‘ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌’ అవార్డు

ABN , First Publish Date - 2021-02-28T08:20:37+05:30 IST

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లికి చెందిన యువ రైతు మావురం మల్లికార్జున్‌రెడ్డి జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు.

యువ రైతుకు ‘ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌’ అవార్డు

అందజేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి

చొప్పదండి, ఫిబ్రవరి 27 : కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లికి చెందిన యువ రైతు మావురం మల్లికార్జున్‌రెడ్డి జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో శనివారం జరిగిన కిసాన్‌ మేళా కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి అవార్డును అందజేశారు. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ దేశవ్యాప్తంగా 35 మంది రైతులను ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌ అవార్డులకు ఎంపిక చేసింది. అందులో రాష్ట్రం నుంచి మల్లికార్జున్‌రెడ్డి ఎంపికయ్యారు. మల్లికార్జున్‌రెడ్డి తనకున్న 17 ఎకరాల వ్యవసాయ భూమిలో వినూత్న రీతిలో సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. సమీకృత వ్యవసాయంలో భాగంగా మేకలు, చేపలు, ఆవుల పెంపకాన్ని చేపట్టి అదనపు ఆదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated Date - 2021-02-28T08:20:37+05:30 IST