మురుగునీటిలో కూర్చొని వినూత్న నిరసన

ABN , First Publish Date - 2022-07-07T04:51:56+05:30 IST

కొద్ది రోజులుగా కాగజ్‌నగర్‌ రోడ్లపై గుంత లు ఏర్పడివర్షం నీరు, మురుగు నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. ఈ రోడ్ల దుస్థితిని అధి కారు లెవరూ పట్టించుకోకపోవడాన్ని నిర సిస్తూ బుధవారం లారీ చౌరస్తాలో రోడ్డుపై నిలిచి ఉన్న వరద నీటిలో కూర్చుని సీపీఎం పట్టణ కార్యదర్శి ముంజం ఆనంద్‌ వినూత్నంగా నిరసన తెలిపాడు. విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్‌ డీఈఈ రమాదేవి, పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొన్నారు.

మురుగునీటిలో కూర్చొని వినూత్న నిరసన
నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకుడు ముంజం ఆనంద్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 6: కొద్ది రోజులుగా కాగజ్‌నగర్‌ రోడ్లపై గుంత లు ఏర్పడివర్షం నీరు, మురుగు నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. ఈ రోడ్ల దుస్థితిని అధి కారు లెవరూ పట్టించుకోకపోవడాన్ని నిర సిస్తూ బుధవారం లారీ చౌరస్తాలో రోడ్డుపై నిలిచి ఉన్న వరద నీటిలో కూర్చుని సీపీఎం పట్టణ కార్యదర్శి ముంజం ఆనంద్‌ వినూత్నంగా నిరసన తెలిపాడు. విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్‌ డీఈఈ రమాదేవి, పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. ఎస్పీఎం యాజమాన్యం మురికి కాలువలు శుభ్రం చేయకపోవడమే దీనికి కారణమని ఆయన అధికారులతో వాగ్వాదానికి దిగాడు. గుంతలు పడిన రోడ్డును మరమ్మతులు చేపడతామని డీఈఈ తెలిపారు. అయినా మిల్లు యాజమాన్య ప్రతినిధులు వచ్చే వరకు ఇక్కడి నుండి లేచేదిలేదని కూర్చుండిపోయాడు. దీంతో పోలీసలుఉ ఆయనను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. మిల్లు యాజమాన్య ప్రతినిధులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిరసన తెలుపడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనంతరం పక్కనే ఉన్న కాలువలోని నీటిని తొలగించడంతో వరద నీరు వెళ్లి పోయింది.

Updated Date - 2022-07-07T04:51:56+05:30 IST