Inorbit Mall: చిరుసాయంతో సంతృప్తి.. ఇనార్బిట్ మాల్‌లో డొనేషన్ డ్రైవ్

ABN , First Publish Date - 2022-09-20T02:34:51+05:30 IST

కొన్నిసార్లు మనం చేసే చిన్న సాయం కూడా ఇతరుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తాయి. ఇలాంటి చిరుసాయాన్ని అర్థిస్తూ

Inorbit Mall: చిరుసాయంతో సంతృప్తి.. ఇనార్బిట్ మాల్‌లో డొనేషన్ డ్రైవ్

హైదరాబాద్‌: కొన్నిసార్లు మనం చేసే చిన్న సాయం కూడా ఇతరుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తాయి. ఇలాంటి చిరుసాయాన్ని అర్థిస్తూ హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ (Inorbit Mall) ప్రత్యేకంగా ‘బైగాన్ ఫ్యాషన్’ పేరుతో ఓ వినూత్న ప్రారంభించింది. తాము చేస్తున్న సాయంలో మీరూ పాలుపంచుకోవచ్చని నగరవాసులను కోరుతోంది. 


తాము వాడేసిన, లేదంటే అవసరం లేదనుకున్న వస్త్రాలను విరాళంగా అందించాలని పేర్కొంది. వీటిని తమ ఎన్జీవో భాగస్వామి అయిన ‘నిర్మాణ్’ (nirmaan)కు అందిస్తుంది. ఈ చిరుసాయం ఇతరుల ముఖాలపై నవ్వులు పూయిస్తుందని చెబుతోంది. ఇందుకోసం  మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో ప్రత్యేకంగా ఓ డొనేషన్‌ బాక్స్‌ ఏర్పాటు చేసింది.


ఇందులో వస్త్రాలు వేసే నగరవాసులు బోల్డంత సంతోషాన్ని సంపాదించుకోవడమే కాదు.. జేబునిండా ఆనందాన్ని నింపుకోవచ్చు. ఈ డొనేషన్‌ బాక్స్‌లో వస్త్రాలు వేసిన వారికి గిఫ్ట్‌ ఓచర్లను  అందిస్తున్నారు. షరతులకు లోబడి వాటిని మాల్‌లో ఆటమ్‌ కలెక్షన్‌ కొనుగోలుపై మార్చుకోవచ్చు. మరెందుకు ఆలస్యం చిరుసాయం చేశామన్న తృప్తితో పాటు గిఫ్ట్ ఓచర్లతో కావాల్సిన వాటిని కొనుగోలు చేసుకోండి.


Updated Date - 2022-09-20T02:34:51+05:30 IST